ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) అరుదైన రికార్డు నమోదు చేసింది. రూ.లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్(ఎం-క్యాప్)(IRCTCM-Cap) ఎలీట్ క్లబ్‌లో చేరిన తొమ్మిదో ప్రభుత్వ రంగ సంస్థగా(పీఎస్యూగా)(PSU stocks news) నిలిచింది. ఈ ఏడాది ఇప్పటివరకు షేర్ల విలువ 300 శాతానికిపైగా పెరగడం వల్ల ఇది సాధ్యమైంది.
దేశీయంగా సానుకూల పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం.. స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా ఐఆర్‌సీటీసీ షేర్లు(IRCTC stock price) మంగళవారం దూసుకుపోతున్నాయి. బీఎస్ఈలో సంస్థ షేర్లు 6 శాతానికిపైగా పుంజుకుని.. రూ.6,266.70 వద్ద కొనసాగుతోంది.
దీనితో సంస్థ మార్కెట్ క్యాపిటల్ (IRCTC M-cap) రూ.లక్ష కోట్ల మార్కును చేరుకుంది.
రెండేళ్లలో 18 రెట్లకుపైగా..
2019 అక్టోబరు 14న బీఎస్ఈలో ఐఆర్‌సీటీసీ(IRCTC news) లిస్ట్ అయింది. అప్పటి నుంచి 18 రెట్లు లేదా 1,737 శాతానికిపైగా పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 308.1శాతం లాభపడగా.. అక్టోబరులో ఇప్పటివరకు 58శాతం వృద్ధి చెందింది.