తెలంగాణ

telangana

ETV Bharat / business

టాప్​ స్మార్ట్​ఫోన్లలో మొదటి నాలుగు ఐఫోన్​లే​

ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా అమ్ముడైన​ స్మార్ట్​ఫోన్ జాబితాలో యాపిల్​ ఐఫోన్​-12 నిలిచింది. 5జీ సాంకేతికతతో పాటు.. ఐఫోన్​-11కి అప్​డేట్​ వెర్షన్​గా తయారైన మోడల్ అయినందున వినియోగదారులు ఆసక్తి చూపించారని కౌంటర్​ పాయింట్​ నివేదిక తెలిపింది. ఇక ఈ అమ్మకాలు అమెరికాలోనే అధికంగా నమోదయ్యయని పేర్కొంది.

By

Published : Apr 11, 2021, 12:47 PM IST

iPhone 12 was the best-selling smartphone in the world in January 2021: Counterpoint report
జనవరిలో ఐఫోన్-12​ అమ్మకాలు అదుర్స్

2021 జనవరిలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్​ ఐఫోన్ 12 అవతరించింది. అంతేగాక ఐఫోన్-12ప్రో, ఐఫోన్-12ప్రో మాక్స్​లు అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ప్రపంచంలో వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయని కౌంటర్ పాయింట్ నివేదిక వెల్లడించింది. ఈ మూడు మోడళ్లు జనవరి-2021లో యాపిల్​ అమ్మకాల్లో 71% వాటాను కలిగి ఉన్నట్లు తెలిపింది. ఇక ఆశ్చర్యం కలిగించే రీతిలో రెండేళ్ల కిందటి మోడల్​ ఐఫోన్-11 అత్యధికంగా అమ్మకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.

ఐఫోన్-12 సీరీస్​ను గతేడాది అక్టోబర్‌లో ప్రారంభించింది యాపిల్. ఇది ఐఫోన్-11కు అప్‌డేట్​ వెర్షన్. అంతేగాక​ 5జీ సాంకేతికతో తయారైంది. మార్కెట్లో పోటీని తట్టుకునేందుకు ఈ రెండు ఫీచర్లు సహాయపడినట్లు కౌంటర్ ​పాయింట్​ అంచనా వేసింది. ఈ సిరీస్​లో ఐఫోన్ 12-మినీ, ఐఫోన్-12, ఐఫోన్-12ప్రో, ఐఫోన్-12ప్రో మాక్స్​ ఫోన్​లున్నాయి.

యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ అమ్మకాలు సింహభాగం అమెరికాలోనే నమోదయ్యాయి. అమెరికాలో అత్యధికంగా అమ్ముడైన మోడల్ ఐఫోన్-12ప్రో మాక్స్. ఇందుకు బలమైన నెట్​వర్క్​ క్యారియర్​లు, 5జీకి ఉన్న డిమాండ్ ప్రధాన కారణమని కౌంటర్ పాయింట్ పేర్కొంది.

ఈ జాబితాలో రెడ్‌మీ 9ఎ, రెడ్‌మీ 9 వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు మోడళ్లు కలిపి జనవరిలో షోవోమి స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 25% వాటాను సాధించాయి. ఇక శామ్‌సంగ్ గెలాక్సీ-ఎ21ఎస్ ఏడో స్థానంలో, శామ్‌సంగ్ గెలాక్సీ-ఎ31 తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ఐఫోన్​-12 మిని ఎనిమిదో స్థానంలో ఉంది.

''5జీ సాంకేతికతకు ఆదరణ పెరుగుతోన్న నేపథ్యంలో స్మార్ట్​ఫోన్​ తయారీ కంపెనీలు ఆ దిశగా నూతన మోడళ్లను ఆవిష్కరిస్తున్నాయి. మొబైల్​ ఫోన్ల ధరలు తగ్గుతున్నందున రాబోయే రోజుల్లో ఉత్తమ అమ్మకాల జాబితాలో తక్కువ ధర కలిగిన 5జీ సామర్థ్యం గల స్మార్ట్‌ఫోన్‌లు రానున్నాయి.''

-మోనికా శర్మ, కౌంటర్ పాయింట్.

ఇవీ చదవండి:అదిరిన షియోమీ కొత్త ఫోన్​.. ధర ఎంతంటే!

ఈ ఏడాదిలోనే గూగుల్​ 5ఏ 5జీ!

48 మంది బిలియనీర్లతో టాప్​-10లోకి ముంబయి

ABOUT THE AUTHOR

...view details