ఆరు రోజుల పాటు నష్టాలను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు వారాంతంలో భారీగా పుంజుకున్నాయి. దీనితో మదుపరుల సంపద శుక్రవారం ఒక్క రోజే రూ.3.52 లక్షల కోట్లు పెరిగింది.
శుక్రవారం సెషన్లో సెన్సెక్స్ 2.28 శాతం పెరిగింది. దీనితో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల సంపద రూ.3,52,020.53 కోట్లు పెరిగింది. మొత్తం సంపద రూ.1,52,28,237.75 కోట్లకు చేరింది.