వచ్చే 12 నెలల్లో భారత్‌లో రూ.2000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ ధ్రువీకరించారు. అధిక పన్నుల కారణంగా భారత్‌లో విస్తరించబోమని కంపెనీ సీనియర్ అధికారి ప్రకటనను ఖండించారు. కార్లు, మోటార్‌బైక్‌లపై ప్రభుత్వ పన్నులు చాలా అధికంగా ఉన్నాయని.. ఈ నేపథ్యంలో విస్తరణను నిలిపివేయనున్నట్లు కంపెనీ వైస్ ఛైర్మన్, పూర్తి కాల సభ్యుడు శేఖర్ విశ్వనాథన్ అంతక్రితం బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
అయితే కేంద్ర పరిశ్రమల మంత్రి ప్రకాశ్ జావడేకర్ దీనిపై స్పష్టతనిస్తూ 'టయోటా కంపెనీ భారత్‌లో పెట్టుబడులను నిలిపివేయనున్నదన్న వార్త అసత్యం. వచ్చే 12 నెలల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు విక్రమ్ కిర్లోస్కర్ తెలిపారు' అని ట్వీట్ చేశారు.