సౌదీ పాత్రికేయుడు జమాల్ కషోగ్జీ హత్య విషయంలో బెజోస్ సొంత పత్రిక వాషింగ్టన్ పోస్ట్ విస్తృతంగా కథనాలు ప్రచురించింది. ఈ హత్య కేసులో సౌదీ రాజుపై ఆరోపణలు వచ్చాయి. ఇందుకు ప్రతీకారంగానే ఫోన్ హ్యాకింగ్‌కు పాల్పడ్డారని బెకర్ వెల్లడించారు.
"బెజోస్ ఫోన్‌ను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని సౌదీ దొంగిలించింది. మా పరిశోధకుల బృందం, చాలా మంది విశ్లేషకులు తేల్చింది ఇదే. వాషింగ్టన్ పోస్ట్‌ను సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రధాన శత్రువుగా భావించారు. ఇందులో బెజోస్ భార్య తమ్ముడి పాత్ర కూడా ఉంది. సమాచారాన్ని బహిర్గతం చేసినందుకు ఆయనకు కొంత డబ్బు అందింది."
- గెవిన్ ది బెకర్, విచారణ అధికారి
ఈ ఆరోపణలపై బెకర్ పూర్తి వివరాలు తెలుపలేదు. సౌదీలోని ఏ విభాగం హ్యాకింగ్‌కు పాల్పడినదీ ప్రస్తావించలేదు. కొన్ని వివరాలు చెప్పేసి సౌదీనే దోషిగా తేల్చారు బెకర్.