ప్రపంచ ఆర్థిక రంగంలో ఏర్పడ్డ మందగమన ప్రభావం భారత్‌పై మరింత ఎక్కువ ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి- ఐఎంఎఫ్ హెచ్చరించింది. మందగమన ప్రభావం వల్ల ఈ ఏడాది వృద్ధి రేటు దశాబ్దంలోనే అత్యంత తక్కువగా నమోదవుతుందని ఐఎంఎఫ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా తెలిపారు.
'ఆర్థిక మందగమన ప్రభావం భారత్‌పైనే అధికం'
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటులో సుమారు 90 శాతం క్షీణత నమోదు అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి- ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ ప్రభావం భారత్‌పై అధికంగా ఉంటుందని హెచ్చరించింది.
ఆర్థిక మందగమన ప్రభావం భారత్‌పైనే అధికం
2019లో ప్రపంచంలోని 90శాతం ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటులో.. క్షీణత నమోదు అవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు జార్జివా. ప్రస్తుతం ప్రపంచం అంతటా ఏకకాలంలో మందగమనం కొనసాగుతున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: రుణాలపై వడ్డీరేట్లు మరింత తగ్గించిన స్టేట్ బ్యాంక్