తెలంగాణ

telangana

ETV Bharat / business

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు - కార్గో సర్వీసులు

కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా విదేశాలకు విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోమారు పొడిగించింది కేంద్రం. ఏప్రిల్ 30 వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది.

International commercial passenger flights to remain suspended till April 30
అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

By

Published : Mar 24, 2021, 5:21 AM IST

దేశంలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని ఏప్రిల్‌ 30 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది.

ఈ అంశంపై డీజీసీఏ జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ సునీల్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశారు. అయితే, కార్గో సర్వీసులకు ఇది వర్తించదని తెలిపాారు. ఇప్పటికే డీజీసీఏ ఎంపిక చేసిన దేశాలకు మాత్రం విమానాలు నడుస్తాయని స్పష్టంచేశారు.

ఇదీ చదవండి:విమాన ప్రయాణం మరింత భారం

ABOUT THE AUTHOR

...view details