తెలంగాణ

telangana

ETV Bharat / business

పాన్​కార్డు లేదా? ఇలా చేస్తే క్షణాల్లోనే 'ఈ-పాన్​' - ఆదాయ పన్ను(ఐటీ) విభాగం

ఆధార్​ ఉన్న వారికి తక్షణమే పాన్​కార్డు పొందే సౌకర్యాన్ని ఈ నెల నుంచే అమలులోకి తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తులు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.

instant-allotment-of-e-pan-based-on-aadhaar-to-begin-this-month
ఇక క్షణాల్లోనే మీ చేతికి 'ఈ పాన్​'

By

Published : Feb 7, 2020, 7:12 AM IST

Updated : Feb 29, 2020, 11:51 AM IST

ఆన్‌లైన్ ద్వారా సత్వరం ‘ఈ పాన్‌ కార్డు’ పొందే విధానాన్ని ఈ నెల నుంచి అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే గురువారం వెల్లడించారు. ఆధార్‌ వివరాలు సమర్పించడం ద్వారా ఆన్‌లైన్‌లో సత్వరం పాన్‌కార్డు పొందేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని కేంద్రం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీంతో ఈ నెల నుంచి ఆ విధానాన్ని తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.

ఓటీపీ వచ్చిన వెంటనే పాన్​...

కొత్త విధానం పనితీరు గురించి వివరిస్తూ.. ‘ఎవరైనా ఈ-పాన్‌ కావాలనుకుంటే సొంతంగా ఆదాయ పన్ను(ఐటీ) విభాగం వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌నంబర్‌ నమోదు చేయాలి. దీంతో ఆధార్‌తో అనుసంధానం అయిన రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ద్వారా వివరాలు పరిశీలన పూర్తయిన తక్షణమే పాన్‌ నంబర్‌ కేటాయించబడుతుంది. అనంతరం ఆన్‌లైన్‌ ఈ-పాన్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు’ అని ఆయన తెలిపారు. పన్ను చెల్లింపుదారులు ఐటీ శాఖకు దరఖాస్తు ఫారమ్ సమర్పించడంలో ఈ విధానం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు.

2020 మార్చి 31 లోగా...

పాన్‌కార్డుతో ఆధార్‌ను లింక్‌ చేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసినప్పటి నుంచి మొత్తం 30.75కోట్ల మంది ప్రక్రియ పూర్తి చేసుకున్నారు. 2020 జనవరి 27 వరకు ఇంకా 17.58కోట్ల మంది పాన్‌కు ఆధార్‌ అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం చివరి తేదీ 2020 మార్చి 31గా ప్రభుత్వం నిర్ణయించింది.

ఇదీ చూడండి: బంగారానికి మళ్లీ రెక్కలు- నేటి ధరలు ఇవే...

Last Updated : Feb 29, 2020, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details