ఇన్‌స్టాగ్రామ్.. డిజిటల్ యుగంలో ఇది మనిషి జీవితంలో ఓ భాగమైపోయింది. ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వాడేందుకు సులభంగా ఉండటం ఇందుకు ఓ కారణం. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని హిడెన్ ఫీచర్స్ ఉన్నాయి. యాప్‌ను రోజూ ఉపయోగిస్తున్నప్పటికీ.. వాటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ ఫీచర్స్‌ను స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మొస్సేరి వెల్లడించారు. మరి అవేంటో చూసేద్దామా..
ఫీచర్స్ ఇలా..
ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే.. ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌ని కొంచెంసేపు క్లిక్ చేసినట్లయితే.. అది నేరుగా సెర్చ్ ఆప్షన్‌కి తీసుకెళుతుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు ఖాతాలను ఉపయోగించే వారు ఉంటారు. వారి కోసం కొత్తగా ఓ ఫీచర్‌ను తీసుకొచ్చింది సంస్థ. కింది భాగంలో ఎడమవైపు ఉండే ప్రొఫైల్ ఐకాన్‌ను డబుల్ క్లిక్ చేస్తే.. ఖాతాలు స్విచ్ అవుతాయి.
ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో స్క్రోల్ చేస్తూ చేస్తూ తిరిగి పైకి వెళ్లాలనుకుంటే.. హోమ్ ఐకాన్‌పై నొక్కితే సరిపోతుంది. వివిధ స్టోరీలను తెరవకుండానే వాటిని ఎలా చూడొచ్చు అన్నదానికి ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లోని థంబ్‌నెయిల్‌ని నొక్కి పట్టుకుంటే సరిపోతుందని మొస్సేరి పేర్కొన్నారు. అయితే ఈ రెండు ఫీచర్లు వినియోగదారులకు సుపరిచితమైనవే.
ఇవీ చదవండి:క్రోమ్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త!
48 మంది బిలియనీర్లతో టాప్-10లోకి ముంబయి