తెలంగాణ

telangana

By

Published : Dec 11, 2019, 6:16 PM IST

ETV Bharat / business

ఇన్ఫోసిస్​కు ఐరాస 'క్లైమేట్​ న్యూట్రల్​ నౌ' అవార్డు

ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్​ సంస్థకు ఐక్యరాజ్యసమితి 'క్లైమేట్ న్యూట్రల్ నౌ' విభాగంలో 'గ్లోబల్​ క్లైమేట్​ యాక్షన్' అవార్డు దక్కింది. వాతావరణ మార్పులపై చేసిన సేవలకు గానూ ప్రతి ఏడాది ఐక్యరాజ్యసమితి ఈ అవార్డును అందిస్తోంది.

ఇన్ఫోసిస్​కు ఐరాస 'క్లైమేట్​ న్యూట్రల్​ నౌ' అవార్డు
ఇన్ఫోసిస్​కు ఐరాస 'క్లైమేట్​ న్యూట్రల్​ నౌ' అవార్డు

ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిన్​ మరో ఘనత సాధించింది. క్లైమేట్ న్యూట్రల్​ నౌ విభాగంలో ఐక్యరాజ్యసమితి అందించే గ్లోబల్​ క్లైమేట్​ యాక్షన్​ అవార్డును సొంతం చేసుకుంది భారత కార్పొరేట్​ దిగ్గజం. ఈ అవార్డు పొందిన తొలి భారత కార్పొరేట్ సంస్థగా సరికొత్త రికార్డు సృష్టించింది ఇన్ఫోసిస్​.​

స్పెయిన్​ మాడ్రిడ్​లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల సమావేశంలో ఈ అవార్డు అందుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వాతావరణంలో జరిగే మార్పులను పరిష్కరించేందుకు వినూత్నంగా, ఆచరణాత్మక చర్యలతో ఇన్ఫోసిస్​ చేపట్టిన 'కార్బన్​ న్యూట్రల్​ ప్రోగ్రామ్'​కు ఈ అవార్డు దక్కినట్లు వెల్లడించారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా వాతావరణ మార్పులతో పాటు లింగ సమానత్వం, ఆరోగ్య శ్రేయస్సు, ఆర్థిక అవకాశాలు తదితర అంశాల్లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కార్బన్​ న్యూట్రల్ ప్రోగ్రామ్​.. పలు చర్యలను సూచించిందని తెలిపారు.

కార్బన్​ న్యూట్రాలిటీ కోసం ఇన్ఫోసిస్ చేసిన ప్రయత్నం నిజంగా స్ఫూర్తినిచ్చేలా ఉందని ఐరాస గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ మేనేజర్ ప్రోగ్రామ్ నిక్లాస్ కొనియాడారు.

ఇదీ చూడండి:ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఇక అనుమతి తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details