వచ్చే ఏడాది ప్రవేశ పెట్టే సాధారణ బడ్జెట్‌పై సూచనలు, ప్రతిపాదనలు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. కొవిడ్-19 అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపిన దృష్ట్యా... బడ్జెట్‌పై కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆర్థిక సంఘాలు, పలువురు నిపుణులు సూచనలివ్వాలని పేర్కొంది.
వివిధ సంస్థలు.. వారి సలహాలను ఈ-మెయిల్ ద్వారా పంపాలని కోరింది. నవంబర్ 15 నుంచి 30 వరకు సామాన్య ప్రజలు కూడా 'మై గవర్నమెంట్' వెబ్ సైట్ ద్వారా సలహాలను పంపే అవకాశం కల్పించింది.