తెలంగాణ

telangana

ETV Bharat / business

2019 నవంబర్​లో కోలుకున్న పారిశ్రామికోత్పత్తి

మూడు నెలలుగా తిరోగమనంలో పయనించిన పారిశ్రామిక రంగం 2019 నవంబర్​లో వృద్ధి కనబర్చింది. గత ఏడాది 11వ నెలలో పారిశ్రామికోత్తి 1.8 శాతం వృద్ధి నమోదు చేసినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. తయారీ రంగం 2.7 శాతం వృద్ధి చెందినట్లు తెలిపింది.

Industrial production grows 1.8 pc in Nov
2019 నవంబర్​లో కోలుకున్న పారిశ్రామికోత్పత్తి

By

Published : Jan 11, 2020, 6:55 AM IST

దేశంలో ఆర్థిక మందగమనం నెలకొన్నప్పటికీ 2019 నవంబర్​లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి కనబర్చింది. మూడు నెలల ప్రతికూల వృద్ధికి తెరదించుతూ నవంబర్​లో​ 1.8 శాతం వృద్ధి నమోదు చేసినట్లు జాతీయ గణాంక కార్యాలయం వెల్లడించింది. 2018 నవంబర్​లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 0.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

అధికారిక డేటా ప్రకారం, 2019 నవంబర్​లో తయారీ రంగం 2.7 శాతం వృద్ధి నమోదు చేసినట్లు స్పష్టమైంది. గత ఏడాది నవంబర్​లో ఈ వృద్ధి కేవలం 0.7 శాతంగా ఉంది.

మరోవైపు విద్యుత్​ రంగం తిరోగమన బాటలో పయనించింది. 2019 నవంబర్​లో విద్యుత్​ ఉత్పాదన -5 శాతానికి పడిపోయింది. 2018 నవంబర్​లో ఈ రంగం 5.1 శాతం వృద్ధి నమోదు చేసింది.

2019 నవంబర్​లో మైనింగ్​ రంగంలో వృద్ధి 1.7 శాతానికి పరిమితమైంది. గత ఇదే సమయంలో ఈ వృద్ధి 2.7 శాతంగా ఉంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-నవంబర్​లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ వృద్ధి భారీగా పతనమైంది. 2018-19 ఏప్రిల్​-నవంబర్​ మధ్య పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5 శాతంగా ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అదే కాలంలో 0.6 శాతానికి దిగజారింది.

ABOUT THE AUTHOR

...view details