కరోనా లాక్‌డౌన్‌తో తయారీ, గనులు, విద్యుదుత్పత్తి రంగాల ఉత్పత్తిలో తగ్గుదల ప్రభావం 2020 జులైలో పారిశ్రామిక ఉత్పత్తిపైనా ప్రభావం చూపించింది. 2019 జులైతో పోలిస్తే పారిశ్రామిక ఉత్పత్తిలో 10.4 శాతం తగ్గుదల నమోదైంది.
పారిశ్రామిక ఉత్పత్తిలో 10.4 శాతం తగ్గుదల - జులైలో పారిశ్రామిక ఉత్పత్తి
దేశంలో లాక్‌డౌన్ కారణంగా పారశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని కేంద్ర గణాంకాలు, ప్రణాళిక అమలు శాఖ నివేదిక వెల్లడించింది. 2019 జులైతో పోలిస్తే పారిశ్రామిక ఉత్పత్తిలో 10.4 శాతం తగ్గుదల నమోదైందని నివేదించింది.
పారిశ్రామిక ఉత్పత్తి
అదే సమయంలో తయారీ రంగంలో 11.1 శాతం, గనుల రంగంలో 13శాతం, విద్యుదుత్పత్తిలో 2.5శాతం క్షీణత నమోదైనట్లు కేంద్ర గణాంకాలు, ప్రణాళిక అమలు శాఖ విడుదల చేసిన నివేదిక తెలిపింది.
2020 జులైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 118.1శాతంగా నమోదు కాగా, ఏప్రిల్‌లో 54శాతం, మేలో 89.5శాతం, జూన్‌లో 108.9శాతం నమోదైంది. లాక్‌డౌన్ కారణంగా అనేక తయారీ కంపెనీలు మూతపడడం వల్ల గతేడాది జులైతో పోలిస్తే పారిశ్రామిక ఉత్పత్తి ఈ ఏడాది జులైలో క్షీణత నమోదు చేసినట్లు గణాంక శాఖ వెల్లడించింది.