దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్డౌన్ సడలింపు తర్వాత విమానయాన సేవల పునఃప్రారంభంపై దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా తమ విమానాలన్నింటినీ ఎప్పటికప్పుడు క్షుణ్నంగా శుభ్రం చేయనున్నట్లు తెలిపింది. కొన్ని రోజుల వరకు విమానాల్లో అందించే భోజనాలను రద్దు చేయాలని భావిస్తున్నట్లు ఇండిగో సీఈఓ రోనోజాయ్ దత్తా ప్రకటించారు. విమానాశ్రయాల్లో తిరిగే తమ బస్సుల్లో 50 మంది మాత్రమే ప్రయాణించే విధంగా పరిమితులు విధించనున్నట్లు తెలిపారు.
కరోనా ఎఫెక్ట్: ఆ విమానాల్లో ఇక భోజనాలు బంద్ - కరోనా న్యూస్ లెటెస్ట్
కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా విమాన సర్వీసులు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత విమాన సేవలు తిరిగి ప్రారంభించేందుకు సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది దిగ్గజ విమానయాన సంస్థ ఇండిగో. ఇందులో భాగంగా కొన్నాళ్లపాటు విమానాల్లో భోజన సదుపాయం రద్దు చేయాలని భావిస్తోంది.
ఇండిగో విమానల్లో భోజనాలు రద్ధు
ఈ కొత్త ప్రణాళికలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు రోనోజాయ్ దత్తా.