దేశీయ చౌక విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ సర్వర్ మొరాయించింది. నెట్వర్క్లో సాంకేతిక లోపంతో సేవలు నిలిచిపోయాయి. ఈ రోజు ఉదయం నుంచి ఈ పరిస్థితి తలెత్తిందని.. దీని పట్ల ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇండిగో సర్వర్ డౌన్... ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు - ఇండిగో ఎయిర్లైన్స్ విమానశ్రయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు
ఇండిగో ఎయిర్లైన్స్ సర్వర్ వ్యవస్థ స్తంభించింది. సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. వీలైనంత వేగంగా సమస్యను పరిష్కరిస్తామని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
![ఇండిగో సర్వర్ డౌన్... ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4953562-thumbnail-3x2-indigo.jpg)
మొరాయించిన ఇండిగో సర్వర్... ప్రయాణికుల ఇక్కట్లు
ఇండిగో సర్వర్ డౌన్... ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
అన్ని విమానశ్రయాలపై దీని ప్రభావం పడుతుందని.. ఇండిగో తెలిపింది. సాధ్యమైనంత త్వరలో ఈ సమస్యను పరిష్కరిస్తామని స్పష్టం చేసింది. ఏదైనా సహాయం, సమాచారం కోసం.. తమ కస్టమర్ కేర్, సామాజిక మాధ్యమాల హ్యాండిళ్లను సంప్రదించవచ్చని వెల్లడించింది.
Last Updated : Nov 4, 2019, 3:58 PM IST