తెలంగాణ

telangana

ETV Bharat / business

అమ్మకాల ఒత్తిడి- 35 వేల దిగువకు సెన్సెక్స్ - నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 210 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 71 పాయింట్లు తగ్గింది. ప్రతికూల రేటింగ్ కారణంగా యాక్సిస్​ బ్యాంక్ అత్యధిక నష్టాన్ని మూటగట్టుకుంది.

stock markets today
నేటి స్టాక్ మార్కెట్లు

By

Published : Jun 29, 2020, 3:48 PM IST

Updated : Jun 29, 2020, 5:37 PM IST

వారంలో తొలి రోజు నష్టాలను నమోదు చేశాయి స్టాక్ మార్కెట్లు. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్​ 210 పాయింట్లు కోల్పోయి 34,961 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 71 పాయింట్లు క్షీణించి 10,312 వద్దకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలతో ఆరంభం నుంచే సూచీలపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది.

ఆర్థిక, ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడం నష్టాలకు ప్రధాన కారణం. దేశీయంగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం కూడా నష్టాలకు కారణమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంట్రాడే సాగిందిలా..

సూచీ గరిష్ఠం కనిష్ఠం
సెన్సెక్స్ 35,032 34,662
నిఫ్టీ 10,338 10,224

లాభనష్టాల్లోనివి ఇవే..

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హెచ్​యూఎల్, భారతీ ఎయిర్​టెల్, ఐటీసీ, ఎం&ఎం షేర్లు లాభపడ్డాయి.

ఎస్​&పీ రేటింగ్ కోతతో యాక్సిస్ బ్యాంక్ షేర్లు అత్యధిక నష్టాన్ని నమోదు చేశాయి. టెక్ మహీంద్రా, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ, ఓఎన్​జీసీ, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

రూపాయి..

కరెన్సీ మార్కెట్లో రూపాయి సోమవారం 7 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే మారకం విలువ 75.58 వద్ద స్థిరపడింది.

ఇదీ చూడండి:టిక్​టాక్​కు 'స్వదేశీ' సవాల్​- దూసుకెళ్తున్న చింగారీ!

Last Updated : Jun 29, 2020, 5:37 PM IST

ABOUT THE AUTHOR

...view details