తెలంగాణ

telangana

ETV Bharat / business

లాభాల్లో స్టాక్ మార్కెట్లు- నిఫ్టీ 13,300+

indices-open-on profits on monday
వ్యాక్సిన్​ సానుకూలతలతో లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

By

Published : Dec 7, 2020, 9:53 AM IST

Updated : Dec 7, 2020, 10:10 AM IST

10:00 December 07

అమెరికా ప్యాకేజీ ఆశలు..

స్టాక్ మార్కెట్లు లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 120 పాయింట్లు పెరిగి 45,195 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్లు పెరిగి 13,318 వద్ద కొనసాగుతోంది. 

అమెరికా మరో ఉద్దీపన ప్యాకేజీపై పెరుగుతున్న అంచనాలు, కొవిడ్​ వ్యాక్సిన్​ ఆశల నేపథ్యంలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా ఆర్థిక వ్యవస్థ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతున్నట్లు వరుసగా వెలువడుతున్న నివేదికల అంచనాలు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

  • ఓఎన్​జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఎన్​టీపీసీ, భారతీ ఎయిర్​టెల్ లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, టైటాన్, హెచ్​సీఎల్​, టీసీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:41 December 07

వ్యాక్సిన్​ సానుకూలతలతో లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 155 పాయింట్లు పెరిగి 45,235కి చేరింది. నిఫ్టీ 45 పాయింట్లు వృద్ధి చెంది 13,304 వద్ద ట్రేడ్​ అవుతోంది. కరోనా వ్యాక్సిన్​పై సానుకూలతలు, అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లను ముందుకు నడిపిస్తున్నాయి.

Last Updated : Dec 7, 2020, 10:10 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details