తెలంగాణ

telangana

ETV Bharat / business

రెండో రోజు బుల్ జోరు- కొత్త గరిష్ఠాలకు సూచీలు - స్టాక్ మార్కెట్ల కొత్త రికార్డు

వరుసగా రెండో రోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో అదరగొట్టాయి. సెన్సెక్స్ 394 పాయింట్లు పెరిగి 49,800 మార్క్​కు చేరువైంది. నిఫ్టీ 123 పాయింట్లు పుంజుకుని 14,600 మార్క్ దాటింది.

stocks hit new record
కొత్త గరిష్ఠాలకు స్టాక్ మార్కెట్లు

By

Published : Jan 20, 2021, 3:41 PM IST

స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజు బుల్ జోరు కొనసాగింది. బుధవారం సెషన్​లో బీఎస్​ఈ-సెన్సెక్స్ 394 పాయింట్లు బలపడి జీవనకాల గరిష్ఠమైన 49,792 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 123 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి అయిన 14,645 వద్దకు చేరింది.

జో బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొత్త ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనున్నట్లు వెలువడిన వార్తలు ఆసియా మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. దీనికి తోడు ఐటీ, ఆటో సహా హెవీ వెయిట్ షేర్ల జోరు.. దేశీయ సూచీల లాభాలకు దన్నుగా నిలిచినట్లు తెలుస్తోంది.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్ 49,874 పాయింట్ల అత్యధిక స్థాయి (జీవనకాల గరిష్ఠం), 49,373 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 14,666 పాయింట్ల గరిష్ఠ స్థాయి(సరికొత్త రికార్డు స్థాయి), 14,517 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

టెక్ మహీంద్రా, మారుతీ, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎం&ఎం, ఇన్పోసిస్, హెచ్​సీఎల్​టెక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

పవర్​గ్రిడ్, ఎన్​టీపీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, నెస్లే షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో షాంఘై, సియోల్, హాంకాంగ్ సూచీలు లాభాలను గడించాయి. టోక్యో సూచీ మాత్రం నష్టాలను నమోదు చేసింది.

ఇదీ చూడండి:ఈ-కామర్స్‌లో ఎఫ్‌డీఐ నిబంధనల సవరణ!

ABOUT THE AUTHOR

...view details