భారత్‌లో కరోనా వైరస్ ప్రళయం తగ్గే కొద్దీ మెల్లగా ఆర్థిక వ్యవస్థ పుంజుకొంటోంది. తాజాగా దేశంలో నిరుద్యోగ రేటు కూడా కొంత తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూన్ 13 నాటికి లెక్కగట్టిన గణాంకాల ప్రకారం నిరుద్యోగ రేటు 13.6 శాతం నుంచి 8.7 శాతానికి తగ్గింది. ఈ గణాంకాలను 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ ప్రైవేటు లిమిటెడ్' సంస్థ వెల్లడించింది.
ఆ నివేదిక ప్రకారం... పట్టణాల్లో నిరుద్యోగ రేటు 14.4 శాతం నుంచి 9.7శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది 13.3 శాతం నుంచి 8.2 శాతానికి చేరింది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఎత్తివేతతో మెల్లగా రవాణా రంగం కూడా మెరుగుపడుతోంది. గూగుల్ 'కమ్యూనికేషన్ మొబిలిటీ' నివేదికలో ప్రజారవాణా, ఆఫీసుల్లో మళ్లీ కార్యకలాపాలు పుంజుకున్నట్లు పేర్కొంది. విద్యుత్తు వినియోగం కూడా ఇటీవల కాలంలో బాగా పుంజుకున్నట్లు గత కొన్ని వారాలుగా గణాంకాలు చెబుతున్నాయి.
'జులై చివరి నాటికి లాక్‌డౌన్ నిబంధనలు గణనీయంగా సడలించే అవకాశం ఉంది. దీంతో మార్చి ముందు నాటి పరిస్థితులు మళ్లీ నెలకొనవచ్చు. ఈ పరిస్థితి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కోలుకోవడాన్ని వేగవంతం చేస్తుంది' అని బ్లూమ్‌బర్గ్‌కు చెందిన ఆర్థిక వేత్త అభిషేక్ గుప్తా పేర్కొన్నారు.
ఇదీ చదవండి:ఎమిరేట్స్ ఎయిర్‌కు 30 ఏళ్లలో అత్యధిక నష్టం!