తెలంగాణ

telangana

ETV Bharat / business

దేశంలో నిరుద్యోగ రేటు 24.3 శాతం!

కరోనా లాక్​డౌన్​తో దేశంలో నిరుద్యోగ రేటు వేగంగా పెరుగుతోంది. మే 24తో ముగిసిన వారాంతానికి నిరుగ్యోగ రేటు అత్యధికంగా 24.3 శాతంగా నమోదైంది.

Unemployment rise In India
భారత్​లో పెరిగిన నిరుద్యోగం

By

Published : May 27, 2020, 8:40 PM IST

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్​డౌన్​తో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు అంతకంతకూ పెరుగుతోంది. ఈ నెల 24 నాటికి ముగిసిన వారాంతంతో దేశంలో నిరుద్యోగ రేటు 24.3శాతంగా ఉన్నట్లు సెంటర్ ఫర్​ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి(సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. అంతకు ముందు వారాంతంలో నిరుద్యోగ రేటు 24శాతంగా ఉన్నట్లు పేర్కొంది.

మార్చి నెల చివరి వారం నుంచి దేశంలో లాక్​డౌన్​లో ఉంది. అయితే గడిచిన ఎనిమిది వారాల్లో నమోదైన సగటు నిరుద్యోగ రేటు 24. శాతం కన్నా.. ఈ సారి నిరుద్యోగం ఎక్కువైనట్లు నివేదిక ద్వారా తేలింది.

లాక్​డౌన్​ కారణంగా ఆదాయం క్షీణించి.. చాలా సంస్థలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో నిరుద్యోగ రేటు క్రమంగా పెరుగుతుండటం గమనార్హం.

కార్మిక భాగస్వామ్య రేటు..

మే 24తో ముగిసిన వారాంతానికి కార్మిక భాగస్వామ్య రేటు మళ్లీ 38.7 శాతానికి తగ్గినట్లు నివేదిక తెలిపింది. అంతకు ముందు వారాంతంలో ఇది 38.8శాతంగా ఉన్నట్లు పేర్కొంది. అప్పటి వరకు వరుసగా మూడు వారాలు కార్మిక భాగస్వామ్య రేటు పెరుగుతూ వచ్చిన విషయాన్ని నివేదిక గుర్తుచేసింది.

ఇదీ చూడండి:భారత్​లో 37శాతం మంది బంగారం అసలే కొనలేదంట!

ABOUT THE AUTHOR

...view details