తెలంగాణ

telangana

ETV Bharat / business

తిరోగమనంలో సేవల రంగం: పీఎంఐ - services sector

జూన్​ నెలలో దేశ సేవల రంగం కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని పీఎంఐ ఇండెక్స్ తెలిపింది. కరోనా సంక్షోభం, వ్యాపార కార్యకలాపాలు మందగించడం, కొత్త ఆర్డర్లు లేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.

India's services sector activity contracts for fourth successive month in June: PMI
తిరోగమనంలో సేవల రంగం: పీఎంఐ

By

Published : Jul 3, 2020, 1:01 PM IST

దేశంలో సేవల రంగం కార్యకలాపాలు జూన్​ నెలలో గణనీయంగా తగ్గాయని ఓ సర్వే తెలిపింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో వ్యాపార కార్యకలాపాలు మందగించడం, కొత్త ఆర్డర్లు రాకపోవడమే ఇందుకు కారణమని సర్వే స్పష్టం చేసింది.

'ఐహెచ్​ఎస్ మార్కిట్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్' (పీఎంఐ)... మే నెలలో 12.6 ఉండగా... జూన్​లో అది 33.7గా ఉంది. పీఎంఐ ప్రకారం ఈ ఇండెక్స్ స్కోర్​ 50 పాయింట్లు కంటే తక్కువ ఉన్నట్లయితే... సేవల రంగ కార్యకలాపాలు మందగించినట్లు లెక్క.

మాంద్యం

"భారత్​లో కరోనా వైరస్ సంక్షోభం తీవ్రమైన నేపథ్యంలో జూన్​లో కూడా దేశ సేవల రంగం తిరోగమించింది."

- జో హేస్, ఐహెచ్​ఎస్ మార్కెట్ ఆర్థికవేత్త

'సరళంగా చెప్పాలంటే, దేశం భారీ ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. దీని ప్రభావం కచ్చితంగా ఈ ఏడాది ద్వితీయ అర్ధ భాగంపై ఉంటుంది. వైరస్ సంక్రమణ రేటు అదుపులోకి వస్తే మాత్రం మాంద్యం ప్రభావం కాస్త తగ్గవచ్చు' అని జో హేస్ అభిప్రాయపడ్డారు.

ఇది మంచిది కాదు

'కొన్ని కంపెనీలు బాగానే పుంజుకున్నప్పటికీ చాలా సంస్థలు శాశ్వతంగా, మరికొన్ని తాత్కాలికంగా మూతపడ్డాయి. ఈ ప్రభావంతోనే పీఎంఐ గణాంకాలు పెరిగాయి. ఇది కచ్చితంగా మంచి సంకేతం కాదు' అని జో హేస్ పేర్కొన్నారు.

పీఎంఐ సర్వే ప్రకారం, క్షీణత రేటు నెమ్మదించిన నేపథ్యంలో... సేవల రంగంలో కొంత స్థిరీకరణ కనిపిస్తోంది. మే నుంచి ఇప్పటి వరకు 59 శాతం సంస్థల ఉత్పత్తిలో ఎలాంటి మార్పు లేదు. కేవలం 4 శాతం సంస్థల్లో మాత్రమే వృద్ధి నమోదు కాగా... 37 శాతం సంస్థల్లో వృద్ధి తగ్గింది.

ఉపాధి తగ్గింది

జూన్​లో భారత సేవా రంగంలో ఉపాధి తగ్గిందని సర్వే తెలిపింది. అయితే కొన్ని కంపెనీలు మాత్రం సిబ్బంది లభ్యత తక్కువగా ఉందని పేర్కొన్నాయని వివరించింది.

మిశ్రమ సేవలు, ఉత్పాదక ఉత్పత్తిని కొలిచే మిశ్రమ పీఎంఐ అవుట్​పుట్​ ఇండెక్స్... మేలో 14.8 ఉండగా.. జూన్​లో 37.8కి పెరిగింది. దీని ప్రకారం, ఉత్పాదక ఉత్పత్తి మధ్యస్తంగా ఉండగా, సేవల రంగం కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని సర్వే పేర్కొంది.

హెచ్​ఐఎస్ మార్కిట్... మొత్తం 400 సేవారంగ సంస్థలను సర్వే చేసింది. కన్జూమర్​ (రిటైల్ మినహా), రవాణా, కమ్యునికేషన్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, వ్యాపార సేవలు నుంచి తీసుకున్న డేటా ఆధారంగా ఈ పీఎంఐ ఇండెక్స్​ను రూపొందించింది.

ఇదీ చూడండి:జియోలో మరో విదేశీ సంస్థ పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details