తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏడేళ్ల గరిష్ఠానికి సేవారంగ కార్యకలాపాలు - service sector

భారత్​లో సేవా రంగం కార్యకలాపాలు ఈ జనవరిలో ఏడు సంవత్సరాల గరిష్ఠస్థాయికి చేరుకున్నాయని ఓ సర్వే తెలిపింది. ఐహెచ్​ఎస్ మార్కెట్ ఇండియా సర్వీసెస్​ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్... డిసెంబర్​లో 53.3 శాతం ఉండగా అది ఈ జనవరిలో 55.5కు పెరిగింది.

India's service sector activity growth hits 7-year high in Jan: PMI
ఏడేళ్ల గరిష్ఠస్థాయికి భారత సేవారంగ కార్యకలాపాలు

By

Published : Feb 5, 2020, 1:39 PM IST

Updated : Feb 29, 2020, 6:38 AM IST

భారతదేశ సేవా రంగ కార్యకలాపాలు ఈ జనవరిలో ఏడు సంవత్సరాల గరిష్ఠస్థాయికి చేరుకున్నాయని నెలవారీ సర్వే తెలిపింది. కొత్త వ్యాపార ఆర్డర్లు గణనీయంగా పెరగడం, మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో ఉద్యోగాల కల్పన, వ్యాపారాభివృద్ధి అవకాశాలు మెరుగయ్యాయని కూడా సర్వే పేర్కొంది.

ఐహెచ్​ఎస్ మార్కెట్ ఇండియా సర్వీసెస్​ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్... డిసెంబర్​లో 53.3 శాతం ఉండగా అది ఈ జనవరిలో 55.5కు పెరిగింది. ఇది 'ఉత్పత్తి' 7 సంవత్సరాల గరిష్ఠస్థాయికి చేరుకోవడాన్ని సూచిస్తుంది.

2020 ప్రారంభంలో

"2020 ప్రారంభంలో భారత సేవా రంగం ప్రాణం పోసుకుంది. డీలా పడిపోతుందన్న అంచనాలను పటాపంచలు చేస్తూ, 2019 చివరిలోనే భారత సేవా రంగం వేగాన్ని పుంజుకుంది."

- పొలియన్నా డి లిమా, ఐహెచ్​ఎస్ మార్కెట్ ప్రిన్సిపల్ ఎకనామిస్ట్

ఎగుమతులు తగ్గాయ్

ఈ ఏడాది ప్రారంభంలో భారత ఉత్పత్తుల ఎగుమతులు తగ్గాయి. ముఖ్యంగా చైనా, ఐరోపా, అమెరికా​ నుంచి డిమాండ్ తగ్గింది. ఫలితంగా దేశీయంగా బిజినెస్ ఆర్డర్లు పెరిగాయి. ఇది నిరుద్యోగులకు శుభవార్త అని అన్నారు డి లిమా.

"వ్యాపార ఆదాయాలు పెరగడం వల్ల సర్వీస్ ప్రొవైడర్లు... తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే పనిలో పడ్డారు. ఇది ఉద్యోగార్థులకు శుభవార్త. ప్రత్యేకించి ఉత్పాదక పరిశ్రమ ఫలితాలను పరిశీలిస్తే.. 2012 ఆగస్టు నుంచి దీని వల్ల ఉపాధి కల్పన బాగా పెరిగిందని స్పష్టం అవుతోంది."

- పొలియన్నా డి లిమా, ఐహెచ్​ఎస్ మార్కెట్ ప్రిన్సిపల్ ఎకనామిస్ట్

కలిపి చూస్తే..

తయారీ, సేవల రంగాలన్ని కలిపి చూస్తే... 'పీఎమ్​ఐ అవుట్​పుట్ ఇండెక్స్' డిసెంబర్​లో ఉన్న 53.7 శాతం నుంచి జనవరిలో ఏడు సంవత్సరాల గరిష్ఠస్థాయి 56.3కు పెరిగింది.

ఇదీ చూడండి: నైట్​ షిఫ్టులతో ఐటీ ఉద్యోగులు సతమతం!

Last Updated : Feb 29, 2020, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details