తెలంగాణ

telangana

ETV Bharat / business

జియోకు భారీ షాక్​... 1.29కోట్ల వినియోగదారులు ఔట్ - ఎయిర్​ టెల్​ చందాదారులు

Jio subscribers in india: రిలయన్స్​ జియోకు చందాదారులు షాక్​ ఇచ్చారు. సుమారు 1.29 కోట్ల మంది జియోను వీడారు. మరో వైపు అనూహ్య రీతిలో ప్రభుత్వరంగ సంస్థ అయిన బీఎస్​ఎన్​ఎల్​ తన చందాదారులను భారీ స్థాయిలో పెంచుకుంది. ఈ మేరకు ట్రాయ్​ డిసెంబర్​ నెల గణాంకాలను విడుదల చేసింది.

jio
జియో

By

Published : Feb 17, 2022, 3:30 PM IST

Jio subscribers in india: డిసెంబర్​ నెలతో పోల్చితే భారత్​లో మొబైల్​ చందాదారుల సంఖ్య భారీగా తగ్గింది. సుమారు 1.28కోట్ల మేర వినియోగదారులను టెలికాం సంస్థలు కోల్పోయినట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా (ట్రాయ్​) వెల్లడించింది. ఎక్కువ మంది చందాదారులు రిలయన్స్​ జియో, వొడాఫోన్​ ఐడియాను వీడినట్లు పేర్కొంది. మరోవైపు భారతీ ఎయిర్​టెల్​ తన వినియోదారుల సంఖ్యను పెంచుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ట్రాయ్ గణాకాలను విడుదల చేసింది.

ట్రాయ్ గణాకాల ప్రకారం రిలయన్స్​ జియో సుమారు 1.29 కోట్ల మంది వినియోగదారులను కోల్పోయింది. ప్రస్తుతం మొత్తం జియో చందాదారుల సంఖ్య 41.57 కోట్లుగా ఉన్నట్లు పేర్కొంది ట్రాయ్​. మరోవైపు వొడాఫోన్​ ఐడియాను 16.14 లక్షల మంది వీడారు. ప్రస్తుతం చందాదారులు సంఖ్య 26.55 కోట్లు ఉన్నట్లు ట్రాయ్​ గణాంకాలు చెప్తున్నాయి.

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్​ఎన్​ఎల్​ కూడా క్రమంగా తన చందాదారుల సంఖ్యను సమారు 11 లక్షల వరకు పెంచుకున్నట్లు ట్రాయ్ తెలిపింది. జియో, వొడాఫోన్​ ఐడియా, భారతీ ఎయిర్​టెల్​ టారిఫ్​లను భారీగా పెంచిన నేపథ్యంలో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లు బీఎస్​ఎన్​ఎల్​ వైపు అడుగులు వేసినట్లు వివరించింది.

ఇదే సమయంలో ఎయిర్​టెల్​ ఏకంగా 4.75 లక్షల మంది చందాదారులను రాబట్టుకోగలిగింది. దీంతో మొత్తం వినియోగదారులు సంఖ్య 35.57 కోట్లుగా ఉంది.

ఇదీ చూడండి:Air India: 'ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఎయిర్​ఇండియా'

ABOUT THE AUTHOR

...view details