తెలంగాణ

telangana

ETV Bharat / business

8 ఏళ్ల కనిష్ఠానికి పారిశ్రామిక ఉత్పత్తి... 4.3 శాతం క్షీణత - latest business news

పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబరులో 4.3 శాతం తగ్గిందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. తయారీ, మైనింగ్, విద్యుత్తు రంగాల్లో ఉత్పత్తి క్షీణించింది. ఎనిమిదేళ్ల కనిష్ఠానికి చేరినట్లు స్పష్టమైంది.

పారిశ్రామిక ఉత్పత్తి 4.3శాతం క్షీణత

By

Published : Nov 12, 2019, 5:40 AM IST

ఆర్థిక వ్యవస్థ మందగమనానికి సంకేతంగా సెప్టెంబరులో పారిశ్రామిక ఉత్పత్తి 4.3 శాతం తగ్గిందని అధికారిక గణాంకాలు స్పష్టం చేశాయి. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాల్లో ఉత్పత్తి క్షీణించిందని వెల్లడించింది. గత నెలలో విడుదల చేసిన తాత్కాలిక అంచనాల ప్రకారం 1.1 శాతం క్షీణత నమోదైంది. ఇది ఎనిమిదేళ్ల కనిష్ఠం. చివరగా 2011 అక్టోబర్​లో 5 శాతం మేర పారిశ్రామిక ఉత్పత్తి క్షీణించింది.

ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి దాదాపు 1.3 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయంలో వృద్ధి 5.2 శాతంగా నమోదైంది. ఉత్పాదక రంగంలో ఆర్థిక మందగమనం కనిపించిందని నివేదిక వెల్లడించింది. ఉత్పాదక రంగం సెప్టెంబరులో 3.9 శాతం క్షీణించింది. విద్యుత్ ఉత్పత్తి రంగం ఉత్పత్తి సెప్టెంబరులో 2.6 శాతం.... మైనింగ్ ఉత్పత్తి కూడా సెప్టెంబరులో 8.5 శాతం పడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details