తెలంగాణ

telangana

ETV Bharat / business

2020లో బంగారానికి భారీగా తగ్గిన డిమాండ్ - ఈటీఎఫ్

కరోనా లాక్​డౌన్​ సహా, బంగారం ధరలు జీవనకాల గరిష్ఠానికి చేరినందున 2020లో దేశంలో బంగారానికి డిమాండ్​ భారీగా తగ్గిందని ప్రపంచ పసిడి మండలి(డబ్ల్యూజీసీ) నివేదిక వెల్లడించింది. అయితే క్రమంగా పుంజుకున్న ఆర్థిక కార్యకలాపాలు, స్థిరమైన సంస్కరణలు పసిడి అమ్మకాల వృద్ధికి దోహదం చేస్తాయని తెలిపింది.

India's gold demand down 35 pc to 446.4 tonne in 2020; rebound in 2021 likely
గతేడాది భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

By

Published : Jan 28, 2021, 3:17 PM IST

కరోనా ప్రభావం, లాక్​డౌన్​ ఆంక్షల నేపథ్యంలో దేశంలో బంగారానికి డిమాండ్​ భారీగా తగ్గిందని ప్రపంచ పసిడి మండలి(డబ్ల్యూజీసీ) నివేదిక వెల్లడించింది. అయితే ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరుతో బంగారం కొనుగోళ్లు పెరిగి సాధారణ స్థాయికి వస్తున్నాయని తెలిపింది.

35శాతం తగ్గిన డిమాండ్..

2020లో భారత్​ 446.4 టన్నుల బంగారం అమ్ముడైంది. 2019(690.4 టన్నుల)తో పోల్చితే ఇది 35.34శాతం తక్కువ.

విలువ పరంగా చూస్తే... 2019లో బంగారం డిమాండ్ రూ.2,17,770 కోట్లుగా ఉంది. 2020లో ఇది 14శాతం తగ్గి రూ.1,88,280 కోట్లకు చేరింది.

ఆభరణాల విషయానికొస్తే... 2019తో పోల్చితే డిమాండ్ 42శాతం తగ్గి 315.9 టన్నులకు చేరింది.

మొత్తంగా బంగారం దిగుమతులు 2019తో పోల్చితే 47శాతం తగ్గి 344.2 టన్నులకు చేరాయి.

11ఏళ్ల కనిష్ఠ స్థాయికి..

ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ 11 సంవత్సరాల కనిష్ఠానికి పడిపోయిందని డబ్ల్యూజీసీ నివేదిక తెలిపింది. 2019లో 4,386.4 టన్నుల బంగారం అమ్ముడవ్వగా.. 2020లో ఇది 3,759.6 టన్నులు మాత్రమేనని తెలిపింది. 2009లో 3,385.8 టన్నుల దిగువకు బంగారం డిమాండ్ పడిపోయిందని డబ్ల్యూజీసీ గుర్తుచేసింది.

ఇదీ చదవండి:భారీ నష్టాల్లో మార్కెట్లు- సెన్సెక్స్​ 600 పాయింట్లు మైనస్​

ABOUT THE AUTHOR

...view details