భారత ఆర్థిక వృద్ధి 2019 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 4.7 శాతానికి పడిపోయిందని జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. 2018-19లో ఇదే త్రైమాసికానికి జీడీపీ వృద్ధి 5.6 శాతంగా ఉండడం గమనార్హం.
మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 4.7 శాతమే
2019 మూడో త్రైమాసికంలో దేశ ఆర్థిక వృద్ధి నెమ్మదించి 4.7 శాతానికి పరిమితమైంది. 2018-19లో ఇదే త్రైమాసికానికి జీడీపీ వృద్ధి 5.6 శాతంగా ఉంది. ఈ మేరకు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) డేటా విడుదల చేసింది.
డిసెంబర్ త్రైమాసికంలో 4.7 శాతానికి పడిపోయిన భారత జీడీపీ వృద్ధి
2019 ఏప్రిల్-డిసెంబర్ కాలానికి వృద్ధిరేటు 5.1 శాతంగా నమోదుకాగా ఏడాది క్రితం అది 6.3 శాతంగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.6 శాతం, రెండో త్రైమాసికంలో 5.1 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు సవరించిన గణాంకాలను ఎన్ఎస్ఓ విడుదల చేసింది. మొత్తానికి ఈ ఏడాది 5 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని ఎన్ఎస్ఓ అంచనా వేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే అంచనాలు వేసింది.
ఇదీ చూడండి:బటన్ నొక్కినా కరోనా వస్తుందని వాయిస్ కంట్రోల్ లిఫ్ట్
Last Updated : Mar 2, 2020, 9:25 PM IST