తెలంగాణ

telangana

ETV Bharat / business

ఏప్రిల్​లో ఇంధన గిరాకీ 9.4% డౌన్! - పెట్రోల్ డీజిల్ డిమాండ్​ క్షీణత

ఏప్రిల్​లో పెట్రోల్, డీజిల్ గిరాకీ భారీగా తగ్గింది. కరోనా నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో విధించిన లాక్​డౌన్​ ఇందుకు ప్రధాన కారణం. అధికారిక గణాంకాల ప్రకారం గత నెల 17.01 మిలియన్ టన్నుల ఇంధన వినియోగం జరిగింది.

petrol demand down in India
తగ్గిన ఇంధన డిమండ్

By

Published : May 12, 2021, 4:27 PM IST

దేశంలో కరోనా కారణంగా అనేక రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్లు, పాక్షిక లాక్‌డౌన్లు అమలులో ఉన్నాయి. ఈ కారణంగా ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా ఇంధన డిమాండ్‌ 9.4 శాతం తగ్గింది.

మార్చిలో 18.77 మిలియన్‌ టన్నుల ఇంధన వినియోగం జరగ్గా ఏప్రిల్‌లో అది 17.01 మిలియన్‌ టన్నులకు పడిపోయింది.

ఏప్రిల్‌లో పెట్రోల్‌ అమ్మకాలు (మార్చితో పోలిస్తే) 13 శాతం, డీజిల్‌ అమ్మకాలు 7.5 శాతం తగ్గాయి. ఏటీఎఫ్​ (విమానాల్లో వాడే ఇంధనం) అమ్మకాలు కూడా గత నెల 14 శాతం పడిపోయాయి. వంట గ్యాస్‌ విక్రయాలు 2.1 మిలియన్‌ టన్నులకు పరిమితమయ్యాయి. మార్చితో ఈ విక్రయాలు 6.4 శాతం తక్కువ.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details