దేశవ్యాప్తంగా డిసెంబరులో నిరుద్యోగం నాలుగు నెలల గరిష్ఠానికి పెరిగిపోయింది. నవంబరులో 7.0శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు గత నెలలో 7.9 శాతానికి ఎగబాకింది. ఆగస్టులో గరిష్ఠంగా 8.3 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో విధిస్తున్న ఆంక్షలు ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించడానికి కారణమైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగిత పెరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వినిమయ సెంటిమెంటు కూడా పడిపోయినట్లు సీఎంఐఈ తెలిపింది.
డిసెంబరులో పట్టణ ప్రాంతాల్లో 9.3 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 7.3 శాతం మేర నిరుద్యోగం నమోదైనట్లు సీఎంఐఈ తాజాగా విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. నవంబరులో ఇవి వరుసగా 8.2 శాతం, 6.4 శాతంగా ఉన్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగితే.. గత త్రైమాసికంలో పుంజుకున్న ఆర్థిక వ్యవస్థ తిరిగి తిరోగమనం దిశగా సాగే అవకాశం ఉందని అనేక మంది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్‌లో 5.6 శాతం, తెలంగాణలో 2.2 శాతం నిరుద్యోగిత నమోదైంది. అత్యధికంగా హరియాణాలో 34.1 శాతం నిరుద్యోగ రేటు రికార్డయ్యింది. అత్యల్ప నిరుద్యోగ రేటు కర్ణాటకలో 1.4 శాతంగా ఉంది.
నిరుద్యోగిత ఎక్కువవున్న రాష్ట్రాలు...
హరియాణా - 34.1%
రాజస్థాన్ - 27.1%
ఝార్ఖండ్ - 17.3%
బిహార్ - 16.0%
జమ్మూకశ్మీర్ - 15.0%
నిరుద్యోగిత తక్కువగావున్న రాష్ట్రాలు...