తెలంగాణ

telangana

ETV Bharat / business

డేటా వినియోగంలో భారతీయులే టాప్​ - ఇంటర్నెట్ వినియోగంపై అంచనాలు

దేశంలో 2025 నాటికి సగటున ఒక ఇంటర్నెట్ యూజర్ నెలకు 25 జీబీ డేటా వినియోగించే అవకాశం ఉంది. ప్రముఖ టెలికాం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్సన్​ ఈమేరకు నివేదిక విడుదల చేసింది.

internet user in India
భారత్​లో ఇంటర్నెట్ యూజర్లు

By

Published : Jun 17, 2020, 11:53 AM IST

భారత్​తో ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతున్నట్లు ప్రముఖ టెలికాం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్సన్ తెలిపింది. డేటా వినియోగంపై ఈ సంస్థ విడుదల చేసిన 'మొబిలిటి 2020 జూన్' నివేదికలో పలు కీలక విషయాలు వెల్లడించింది. అవి...

  • 2019లో దేశంలో సగటున నెలకు ఒక యూజర్ 12 జీబీ డేటా వినియోగించాడు. ప్రపంచవ్యాప్తంగా ఇదే అత్యధిక సగటు వినియోగం. భవిష్యత్​లో ఈ వినియోగం మరింత పెరగొచ్చు.
  • 2025 నాటికి ఏకంగా ఒక యూజర్ నెలకు సగటున 25 జీబీ డేటా వినియోగించే అవకాశం ఉంది.
  • దేశవ్యాప్తంగా 4 శాతం ఇళ్లలో మాత్రమే బ్రాడ్​బ్యాండ్ కనెక్షన్​లు ఉన్నాయి. ఇంకా చాలా మంది స్మార్ట్​ఫోన్​ ద్వారానే ఇంటర్నెట్​ వినియోగిస్తున్నారు.
  • కరోనా లాక్​డౌన్​తో ఇళ్లలో ఉండే బ్రాడ్​బ్యాండ్​ల​ ద్వారా ఇంటర్నెట్ వినియోగం 20 నుంచి 100 శాతం పెరిగింది.
  • 2025 నాటికి దేశంలో డేటా ట్రాఫిక్ నెలకు 21 ఎక్సాబైట్​లకు పెరగొచ్చు.
  • ఈ స్థాయిలో డేటా వినియోగం పెరిగేందుకు దేశంలో స్మార్ట్​ఫోన్ యూజర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్​ వాడకం, సగటు డేటా వినియోగం పెరగటం వంటివి తోడవ్వచ్చు.
  • డేటా ధరలు తక్కువగా ఉండటం, వీడియోలు, ఇతర అవసరాలకు ఇంటర్నెట్ ఎక్కువగా వాడటం కూడా ఇందుకు కారణం కావచ్చు.
  • 2025 నాటికి భారత్​లో 410 మిలియన్లు (41 కోట్లు) మంది స్మార్ట్​ఫోన్​లు వినియోగిస్తారు.
  • దేశంలో 2025 నాటికి 18 శాతం మంది 5జీ నెట్​వర్క్​ను, 64 శాతం మంది ఎల్​టీఈ (4జీ), మిగతవారు 2జీ/3జీ నెట్​వర్క్ వినియోగించే వీలుంది.

ప్రపంచవ్యాప్తంగా ఇలా..

  • ప్రపంచవ్యాప్తంగా డేటా ట్రాఫిక్​ 2019లో 33 ఎక్సాబైట్​లుగా ఉంది. ఇది 2025 నాటికి 164 ఎక్సాబైట్​లకు పెరగొచ్చు.
  • 2020 చివరి నాటికి 190 మిలియన్ల మంది 5జీకి మారే అవకాశం ఉంది. 2025 నాటికి ఈ సంఖ్య 2.8 బిలియన్​లు దాటొచ్చు.
  • రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది 5జీకి మారినా.. మార్కెట్లో ఎల్​టీఈ (4జీ) అధిపత్యం కొనసాగుతుంది.

ఇదీ చూడండి:కరోనా కాలంలో బ్యాంకులు సరికొత్తగా...

ABOUT THE AUTHOR

...view details