తెలంగాణ

telangana

ETV Bharat / business

ఓటీటీల్లోనే అధిక సమయం గడిపిన భారతీయులు - JioFibre

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​తో ఇళ్లకే పరిమితమైన భారతీయులు ఓటీటీ ప్లాట్​ఫామ్​లలో ఎక్కువ సమయం గడిపినట్లు 'రెడ్​సీర్​' నివేదిక వెల్లడించింది. ఏడాది కాలంగా సినిమాలు, వివిధ షోలు చూసేందుకు భారతీయులు కేటాయించిన సమయం 118 బిలియన్​ నిమిషాలని పేర్కొంది. ఇక ఓటీటీ వీక్షకుల్లో చాలామంది ఎప్పటికప్పుడు నూతన, భిన్న కంటెంట్​ను కోరుకుంటున్నారని నివేదిక తెలిపింది.

Indians spend 188 bn minutes on OTT amid free telco bundling
ఓటీటీల్లో భారతీయులు.. భారీగా పెరిగిన 'వాచ్​టైమ్'

By

Published : Mar 31, 2021, 7:58 PM IST

Updated : Mar 31, 2021, 8:03 PM IST

ఓటీటీ ఫ్లాట్​ఫాంలలో భారతీయులు 188 బిలియన్​ నిమిషాలు గడిపినట్లు 'రెడ్​సీర్​' నివేదిక తెలిపింది. ఒక్క ఫిబ్రవరిలోనే 31 బిలియన్​ నిమిషాల పాటు సినిమాలు చూసినట్లు పేర్కొంది. స్మార్ట్​ఫోన్లతో ఓటీటీ సబ్​స్క్రిప్షన్​లు భారీగా పెరిగినట్లు వెల్లడించింది. ఓ నెలలో గరిష్ఠంగా 69 బిలియన్​ నిమిషాల వీక్షణలు నమోదైనట్లు పేర్కొంది.

రెడ్​సీర్​ నివేదికలో ఆసక్తికర అంశాలు..

  • ఎక్కువ మంది చూసిన యాప్​ వూట్​
  • సినిమాలు ఎక్కువగా చూసిన యాప్ హాట్​స్టార్(33 శాతం)
  • టెలికాం ఆపరేటర్లు, బ్రాడ్​ బ్యాండ్​ కంపెనీలు ఇచ్చిన ఆఫర్లతో చందాదారులు మరింత పెరిగారు.
  • వార్షిక చందాలపై ఆఫర్లు ఇవ్వడం కారణంగా చందాదారుల సంఖ్య అమాంతం పెరిగింది.
  • గతేడాదితో పోల్చితే ఎక్కువ మంది చందాదారులు కొత్త కంటెంట్​ను కోరుకుంటున్నారు.

"వినియోగదారులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో పలు చిత్రనిర్మాణ సంస్థలు కూడా ఆన్​లైన్​లో కంటెంట్​ ఇవ్వడానికి ఇష్టపడ్డాయి. వీటితో పాటు సంబంధిత సంస్థలు కూడా పలు చిత్రాలను నిర్మించాయి. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫాంలకు డిమాండ్​ పెరిగింది."

-నిఖిల్​ దలాల్, ఉజ్జ్వల్​ చౌధూరీ, రెడ్​సీర్​

మారిన అభిరుచి..

గత ఏప్రిల్​తో పోలిస్తే.. ఫిబ్రవరిలో వీక్షణా సమయం ఆరు శాతం తగ్గింది. ఎందుకంటే ఆంక్షల సడలింపుతో సాధారణ స్థితి ప్రారంభమైన వేళ.. ప్రేక్షకుల అభిమాన టీవీ షోలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే.. ఓటీటీ ప్లాట్​ఫామ్​లలో రిలీజయ్యే కంటెంట్​ విస్తృతి పెరిగిన నేపథ్యంలో.. వీటికి వీక్షణలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

ఓటీటీల్లో భారతీయులు.. భారీగా పెరిగిన 'వాచ్​టైమ్'

గత సంవత్సర కాలంలో వినియోగదారుల అభిరుచి చాలావరకు మారిపోయింది. సరికొత్త షోలు, భిన్నమైన కంటెంట్​ కోసం ఓటీటీలపై ఆధారపడుతున్నారు.

స్మార్ట్ టీవీ వినియోగదారులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో డిస్నీ+హాట్‌స్టార్, వూట్ సెలెక్ట్, హోయిచోయ్, సన్‌నెక్ట్స్ వంటి ఓటీటీ ఛానళ్లు ప్రాంతీయంగా మరిన్ని భాషల్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇది పరిశ్రమ వృద్ధిని వేగవంతం చేస్తుందని నివేదిక తెలిపింది.

ఇవీ చదవండి:'ఓటీటీల నియంత్రణ' పిటిషన్లపై సుప్రీం స్టే

ఓటీటీల నియంత్రణపై కేంద్రం అఫిడవిట్​

ఓటీటీ, డిజిటల్​ మీడియా మాధ్యమాలు ఇవి పాటించాల్సిందే!

ఆ క్రమబద్ధీకరణ నిబంధనలు చట్టబద్ధమేనా?

Last Updated : Mar 31, 2021, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details