తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ- లెర్నింగ్​ విద్యకే భారతీయుల ఓటు!

ప్రముఖ మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ వెలాసిటీ ఎమ్​ఆర్​ తాజాగా ఓ సర్వే విడుదల చేసింది. 72 శాతం మంది భారతీయులు సంప్రదాయ తరగతి గది శిక్షణ కంటే ఆన్​లైన్​/ ఈ-లెర్నింగ్ మోడ్​ శిక్షణను ఇష్టపడుతున్నారని పేర్కొంది. ముఖ్యంగా ఐటీ, కంప్యూటర్స్​, టెక్నాలజీ రంగాలకు చెందిన నిపుణులు ఎక్కువగా ఆన్​లైన్ అభ్యాసం వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టం చేసింది.

Indians prefer online mode than traditional classroom training
ఆన్​లైన్ విద్యకే భారతీయుల ఓటు!

By

Published : Mar 17, 2020, 11:58 AM IST

భారతీయులు సంప్రదాయ తరగతి గది శిక్షణ కంటే ఆన్​లైన్​ విద్య వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని తాజాగా ఓ సర్వే స్పష్టం చేసింది. దీనికి కారణం ఎప్పుడైనా, ఎక్కడైనా తక్కువ ఖర్చుతో నేర్చుకునే సౌలభ్యాన్ని 'ఈ-లెర్నింగ్​/ఆన్​లైన్​' కోర్సులు అందిస్తుండటమే అని విశ్లేషించింది.

ప్రముఖ మార్కెట్ పరిశోధన, విశ్లేషణ సంస్థ వెలాసిటీ ఎమ్​ఆర్​ ప్రకారం, 72 శాతం మంది భారతీయులు సంప్రదాయ తరగతి గది శిక్షణ కంటే ఆన్​లైన్​/ ఈ-లెర్నింగ్ మోడ్​ శిక్షణను ఇష్టపడుతున్నారు.

లెర్నింగ్ యాప్స్​

భారత్​లో ప్రస్తుతం బైజు అత్యంత ఆదరణీయ ఈ లెర్నింగ్ యాప్​గా ఉంది. దీని తరువాత ఉడెమి, కోర్సెరా, అన్​-అకాడమీ, లిండా, ఎన్​ఐఐటీ, ఇగ్నో, ఆలివ్​బోర్డు లాంటి ఇతర లెర్నింగ్​ యాప్​లున్నాయి.​

వెలాసిటీ ఎమ్​ఆర్ సర్వే ప్రకారం, ఆన్​లైన్ లెర్నింగ్ విధానం విద్యార్థులు/ అభ్యాసకులకు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ-బోధన విధానం... ఉపాధ్యాయులు ఎక్కడ నుంచైనా బోధించడానికి, విద్యార్థులు అభ్యాసం చేయడానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా ఎంతో సమయం ఆదా అవుతుంది. అలాగే అధ్యాపకులను నేరుగా సంప్రదించే అవకాశం విద్యార్థులకు లభిస్తుంది.

"25 నుంచి 45 ఏళ్ల వయస్సు వారు ఎక్కువగా ఆన్​లైన్/ఈ-లెర్నింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇందులో 94 శాతం మంది ముఖ్యంగా ఐటీ, కంప్యూటర్స్​, టెక్నాలజీ రంగాలకు చెందిన నిపుణులు." - జసల్ షా, వెలాసిటీ ఎమ్​ఆర్ మేనేజింగ్ డైరెక్టర్​ అండ్​ సీఈఓ

అయితే.. ఇప్పటికీ 1/4 వంతు విద్యార్థులు తరగతి శిక్షణకే ప్రాధాన్యమిస్తున్నారని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. ఉపాధ్యాయులతో విద్యార్థులు ముఖాముఖి చర్చించడం వల్ల విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుందని వారు అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది.

సరైన సమయంలో...

ఫిబ్రవరిలో బెంగళూరు, ముంబయి, కోల్​కతా, చెన్నై, ఎన్​సీఆర్​, పుణె, హైదరాబాద్​, అహ్మదాబాద్​ల్లో ఈ సర్వే నిర్వహించారు. 2000 మందికి పైగా తమ అభిప్రాయాలను ఈ సర్వేలో వ్యక్తపరిచారు.

కరోనా భయాల మధ్య పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు అన్ని పాఠశాలలు మూసివేయాలని భారత్​లోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సూచించాయి. ఈ సమయంలో ఎక్కువ మంది ఈ-లెర్నింగ్​ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

ఇదీ చూడండి:కరోనా అంతు చూసిన చైనా- వుహాన్​లో సాధారణ స్థితి

ABOUT THE AUTHOR

...view details