చైనా వస్తువులపై దేశంలో గత కొంత కాలంగా వినియోగదారుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా జూన్‌లో గల్వాన్ లోయలో.. 20 మంది భారత సైనికులను చైనా ఆర్మీ అక్రమంగా పొట్టనబెట్టుకున్న తర్వాత.. బాయ్‌కాట్ చైనా ఉద్యమం ఊపందుకుంది. ఈ ప్రభావం పండుగ సీజన్ విక్రయాలపైనా పడింది. ఈ సారి పండుగ సీజన్లో 29 శాతం మంది మాత్రమే చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు ఓ సర్వేలో తేలింది. గత ఏడాది పండుగ సీజన్లో 48 శాతం మంది చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు ఈ సర్వే పేర్కొంది. నవంబర్ 10నుంచి 15 మధ్య దేశవ్యాప్తంగా 204 పట్టణాల్లో జరిగిన సర్వేలో 14 వేల మందికిపైగా పాల్గొన్నారు.
లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన సర్వేలోని మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన 29 శాతం మందిలో.. 71 శాతం మంది తాము చైనా వస్తువులను కొనుగోలు చేస్తున్నట్లు అవగాహన లేదని వెల్లడించారు. 66 శాతం డబ్బుకు విలువనిచ్చేందు ఈ చైనా వస్తువులను కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు.