తెలంగాణ

telangana

ETV Bharat / business

OTT India: 10 ఏళ్లలో 15 బిలియన్​ డాలర్లకు భారత ఓటీటీ పరిశ్రమ! - భారత్​లో ఓటీటీ భవిష్యత్​

OTT India: రానున్న పదేళ్లలో భారత ఓటీటీ పరిశ్రమ విలువ భారీగా పెరగనుందని ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ బాస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బీసీజీ) అంచనా వేసింది. ఏటా దాదాపు 22-25 శాతం వృద్ధి నమోదు చేస్తుందని తెలిపింది.

OTT India
OTT India

By

Published : Jan 3, 2022, 6:03 AM IST

Updated : Jan 3, 2022, 7:15 AM IST

OTT India: వచ్చే దశాబ్ద కాలంలో భారత ఓవర్‌ ది టాప్‌(ఓటీటీ) పరిశ్రమ విలువ 13-15 బిలియన్ డాలర్లకు చేరుతుందని ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ బాస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌(బీసీజీ) అంచనా వేసింది. ఏటా దాదాపు 22-25 శాతం వృద్ధి నమోదు చేస్తుందని తెలిపింది. ఈ రంగంలో దాదాపు 40 సంస్థలు పోటీ పడుతున్నాయని పేర్కొంది. మొబైల్‌ ఇంటర్నెట్‌ వినియోగం వేగంగా విస్తరించడం, ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య పెరగడం కూడా దీనికి దోహదం చేస్తుందని తెలిపింది.

ఈ రంగంలో అంతర్జాతీయ సంస్థలైన నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ వంటివి భారత్‌కు అనుకూలమైన కార్యక్రమాలు రూపొందించడం కూడా ఓటీటీ ఎదుగుదలకు దన్నుగా నిలుస్తోందని బీసీజీ తెలిపింది. అలాగే ధరలను సైతం భారత వినియోగదారులకు అనుగుణంగా నిర్ణయించడం కలిసి వస్తోందని అభిప్రాయపడింది. అమెరికాతో పోలిస్తే భారత్‌లో ఓటీటీ సభ్యత్వ ధరలు 70-90 శాతం తక్కువగా ఉన్నాయని పేర్కొంది.

భారత్‌ ఆధారంగా రూపొందుతున్న వీడియో కంటెంట్‌పై పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయని బీసీజీ తెలిపింది. దీంతో అధిక కార్యక్రమాలు అందుబాటులోకి వస్తున్నాయని పేర్కొంది. విదేశాల్లో ఉన్న భారతీయులకు కూడా ఇవి చేరుతున్నాయని గుర్తుచేసింది.

ఇదీ చూడండి:వృద్ధికి కరోనా, ద్రవ్యోల్బణాలే సవాళ్లు.. ఆ​ ప్రకటనలే దిశానిర్దేశాలు

Last Updated : Jan 3, 2022, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details