ప్రముఖ చమురు మార్కెటింగ్ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కీలక ప్రకటన చేసింది. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశవ్యాప్తంగా 10వేల ఛార్జింగ్ స్టేషన్స్ (Indian Oil EV Charging Station) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. మరో మూడేళ్లలో ఇది పూర్తి కానున్నట్లు (Indian Oil EV Charging Station) ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎస్ఎం వైద్య పేర్కొన్నారు.
"మరో 12 నెలల్లో 2000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్‌ను (Indian Oil EV Charging Station) ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత రెండేళ్లలో మరో 8వేల ఛార్జింగ్ స్టేషన్స్‌ను స్థాపించడం ద్వారా మూడేళ్లలో 10వేల ఛార్జింగ్ స్టేషన్స్‌ను ఏర్పాటు చేయాలనే మా లక్ష్యాన్ని చేరుకుంటాం."
-ఎస్ఎం వైద్య, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్