వినియోగదారులు బుకింగ్ చేసుకున్న రోజే వంటగ్యాస్ డెలివరీ చేసే విధంగా తత్కాల్ సేవ ప్రారంభించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సన్నాహాలు చేస్తుంది. ‘ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో ఒక నగరం లేదా జిల్లాను తత్కాల్ ఎల్‌పీజీ సేవల ప్రారంభానికి గుర్తించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద బుక్ చేసుకున్న 30-45 నిమిషాల్లోనే వినియోగదారుడికి గ్యాస్ డెలివరీ అందించనున్నాం’ అని ఐఓసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. కేంద్రం నినాదమైన ‘సులభతర జీవనం’ మెరుగుపరచడంలో భాగంగా అందించనున్న ఈ సేవలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఫిబ్రవరి 1 కల్లా తత్కాల్ వంటగ్యాస్ సేవలను ప్రారంభించాలని చూస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు.
బుకింగ్ చేసుకున్న రోజే గ్యాస్ డెలివరీ! - బుకింగ్ చేసుకున్న రోజే గ్యాస్ డెలివరీ
ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) త్వరలోనే శుభవార్త అందించనున్నట్లు సమాచారం. బుకింగ్ చేసుకున్న రోజే గ్యాస్ డెలివరీ అందించే యోచనలో సంస్థ ఉన్నట్లు ఐఓసీ అధికారి తెలిపారు.

బుకింగ్ చేసుకున్న రోజే గ్యాస్ డెలివరీ - ఐఓసీ సన్నాహాలు
ఇండేన్ బ్రాండ్ ద్వారా ఐఓసీ వంటగ్యాస్ సిలిండర్‌లను పంపిణీ చేస్తోంది. దేశవ్యాప్తంగా 14 కోట్ల మంది ఇండేన్ వినియోగదారులు ఉన్నారు.
ఇదీ చదవండి :'సిమెంట్ ధరలపై బిల్డర్ల ఆరోపణలు అవాస్తవం'