ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ పరిశ్రమ ఆదాయం 2.3 శాతం పెరిగి.. 194 బిలియన్ డాలర్లకు చేరొచ్చని ప్రభుత్వేతర ట్రేడ్ అసోసియేషన్ 'నాస్కాం' అంచనా వేసింది. ఇదే సమయంలో ఐటీ ఎగుమతులు 1.9 శాతం వృద్ధితో 1.5 బిలియన్ డాలర్లుగా నమోదవ్వచ్చని పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రంగం ఐటీ పరిశ్రమ ఒక్కటేనని నాస్కాం పేర్కొంది. కరోనా సంక్షోభంలోనూ 1.38 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపింది. ఫలితంగా మొత్తం ఉద్యోగాల సంఖ్య 44.7 లక్షలకు చేరినట్లు వివరించింది.