డిసెంబర్‌తో ముగియనున్న త్రైమాసికంతో పోల్చితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో భారత్‌లో ఉద్యోగ నియామకాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నట్లు ఓ సర్వే స్పష్టం చేసింది. ఇందుకు దేశంలో కార్పొరేట్ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కారణమని తెలిపింది. దేశవ్యాప్తంగా 1,518 కంపెనీలపై చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది.
2021లో భారీగా పెరగనున్న నియామకాలు! - ఉపాధి అవకాశాలు
ఈ త్రైమాసికంతో పోల్చితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో.. భారత్‌లో ఉద్యోగ నియామకాలు ఎక్కువగా జరుగుతాయని ఓ సర్వే స్పష్టం చేసింది. మొత్తం 1,518 సంస్థలు ఈ సర్వేలో పాల్గొన్నట్లు 'మ్యాన్ పవర్ గ్రూప్ సర్వే' తెలిపింది.
2021లో భారీగా పెరగనున్న నియామకాలు!
సర్వేలో వెల్లడైన అంశాలు..
- 2021 మొదటి మూడు నెలల్లో ఉపాధి అవకాశాలు రెండు శాతం మేర పెరుగుతాయని అంచనా.
- ఆర్థిక, బీమా, రియల్ ఎస్టేట్, మైనింగ్, నిర్మాణ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి.
- మిగతా అన్నీ రంగాలు ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేశాయి.
- పండుగ సమయం ప్రారంభంతో ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఊపందుకుంటోంది.
- రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో నియామకాలు జోరందుకోనున్నాయి.
- దేశంలోని 65 సంస్థలు కొవిడ్‌కు ముందున్న ఉద్యోగుల సంఖ్య కంటే 44 శాతం ఎక్కువగా ఉద్యోగాలు కల్పించనున్నాయి.
- మధ్యతరహా, భారీ పరిశ్రమల వలే చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా ఉద్యోగార్థులను తీసుకోనున్నాయి. ఇది సానుకూల అంశం.
- ఇటీవల లోక్‌సభ ఆమోదించిన కార్మిక సంస్కరణలు బిల్లుతో.. నిరుద్యోగులకు, యాజమాన్యాలకు ప్రయోజనం చేకూరనుంది.
- తైవాన్, అమెరికా, సింగపూర్ దేశాలు ఉద్యోగ కల్పనలో అధిక వృద్ధిరేటును నమోదు చేశాయి.