తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత వృద్ధిరేటు 5 శాతం క్షీణిస్తుంది: ఎస్​ అండ్ పీ - లాక్​డౌన్​తో క్షీణిస్తున్న భారత వృద్ధిరేటు

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 5 శాతం మేర క్షీణిస్తుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్​ అండ్ పీ అంచనా వేసింది. కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు స్తంభించడమే ఇందుకు కారణమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ అందించామని చెబుతున్నా... వాస్తవంలో అది చాలా చిన్న మొత్తమని తేల్చిచెప్పింది.

S&P says assuming Indian economy to contract 5 pc in FY21
భారత వృద్ధిరేటు 5 శాతం క్షీణిస్తుంది: ఎస్​ అండ్ పీ

By

Published : May 28, 2020, 2:02 PM IST

కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ల కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతం మేర క్షీణిస్తుందని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఎస్​ అండ్ పీ​ అంచనా వేసింది. ప్రస్తుత సంక్షోభ ప్రభావం వచ్చే ఏడాది వరకు కొనసాగుతుందని అభిప్రాయపడింది.

వృద్ధి క్షీణత తప్పదు..

లాక్​డౌన్​ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ హఠాత్తుగా స్తంభించిందని... అందువల్ల దేశ వృద్ధిరేటు క్రమంగా క్షీణిస్తోందని ఆర్​బీఐ సహా పలు ప్రముఖ రేటింగ్ సంస్థలు అంచనా వేశాయి. ఫిచ్, క్రిసిల్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 5 శాతం వరకు తగ్గుతుందని అంచనా వేశాయి. తాజాగా ఎస్​ అండ్ పీ కూడా ఈ జాబితాలో చేరింది. ​

"ఈ ఏప్రిల్​లో... 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 1.8 శాతం ఉంటుందని అంచనా వేశాం. రెండు నెలల లాక్​డౌన్​ నేపథ్యంలో.. ఈ వృద్ధిరేటు 5 శాతం మేర క్షీణిస్తుందని మా అంచనాలను సవరించాం. అలాగే 2021-22 ఏడాది వృద్ధి 8.5 శాతానికి ( మునుపటి అంచనా 7.5 శాతం) చేరుకుంటుందని భావిస్తున్నాం. అయితే 2023లో జీడీపీ 6.5 శాతం, 2024లో జీడీపీ 6.6 శాతం పెరుగుతుంది."

- ఎస్ అండ్​ పీ

అక్కరకు రాని ప్యాకేజీ..

కేంద్ర ప్రభుత్వం ఘనంగా రూ.20 లక్షల కోట్ల కరోనా ప్యాకేజీ ఇచ్చామని ప్రకటించినా... వాస్తవంలో అది చాలా తక్కువగా కేటాయింపులు చేసిందని ఎస్​ అండ్ పీ తేల్చిచెప్పింది. ఇతర దేశాలు కల్పించిన ఉద్దీపనలతో పోల్చితే ఇది ఏమాత్రం సరిపోయేది కాదని స్పష్టం చేసింది.

వాస్తవ నిరుద్యోగం...

ఫిచ్ సొల్యూషన్స్​... భారత్​లో వాస్తవ నిరుద్యోగం విపరీతంగా పెరిపోతోందని, ఫలితంగా వినియోగదారుల వ్యయం భారీగా క్షీణిస్తోందని వెల్లడించింది. ఆర్థిక అనిశ్చితుల వల్ల ప్రైవేట్​ రంగాల్లో పెట్టుబడులు తగ్గుతాయని పేర్కొంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశ వాస్తవ జీడీపీ 4.5 శాతం క్షీణిస్తుందని అంచనా వేసింది.

మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్​... 2021 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు 'శూన్యం'గా ఉంటుందని అంచనా వేసింది. స్వతంత్ర భారతదేశం 1958, 1966, 1980 సంవత్సరాల్లో మాంద్యాన్ని చవిచూసింది. ముఖ్యంగా వ్యవసాయరంగం ఎదుర్కొన్న సంక్షోభమే అందుకు కారణం.

కానీ ఇప్పుడు భారత్​ ఎదుర్కొంటున్న సంక్షోభం చాలా భిన్నమైనది. మూడు విడతలుగా లాక్​డౌన్ పొడిగించడం వల్ల పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించాయి. అయితే క్రమంగా లాక్​డౌన్ సడలింపులు ఇస్తున్న కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి.

ఇదీ చూడండి:దిగ్గజ సంస్థలో 12 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details