2020లో భారత ఆర్థికవ్యవస్థ పుంజుకునే అవకాశం ఉందని 'భారత పరిశ్రమల సమాఖ్య' (సీఐఐ) అభిప్రాయపడింది. ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం సహా భారత ప్రభుత్వం, ఆర్బీఐ తగిన చర్యలు చేపడుతుండడమే ఇందుకు కారణమని సీఐఐ విశ్లేషించింది.
"నూతన సంవత్సరంలో ఆర్థికవ్యవస్థ కోలుకుంటుందనే సంకేతాలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకుంటున్న చర్యల వల్ల పరిశ్రమలు క్రమక్రమంగా మందగమనం నుంచి కోలుకుంటాయి."- భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)
పుంజుకుంటాయ్..
సీఐఐ కేంద్ర ప్రభుత్వానికి ఓ సౌకర్యవంతమైన ఆర్థిక విధానాన్ని సూచించింది. దీని వల్ల ద్రవ్యలోటును 0.5 నుంచి 0.75 శాతం మధ్య నియంత్రించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడింది. ఇందుకోసం మౌలిక సదుపాయాల కల్పనను తొందరగా చేయాల్సిన అవసరమూ ఉందని తెలిపింది.
తయారీ, సేవల రంగాలు మెరుగైన 'పీఎమ్ఐ'ల (కొనుగోలు నిర్వహాకుల సూచిక) రూపంలో పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయని సీఐఐ తెలిపింది. ప్రయాణికుల కార్ల అమ్మకాలు క్షీణించడం, విమాన ప్రయాణాలు పుంజుకోవడం ఇందుకు నిదర్శనమని సీఐఐ అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ అన్నారు. 2019 మూడో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధిరేటులో క్షీణత కొనసాగినప్పటికీ.. త్వరలోనే అది పుంజుకునే అవకాశం ఉందని విక్రమ్ అభిప్రాయపడ్డారు.
భవిష్యత్‌పై ఆశలున్నాయ్