తెలంగాణ

telangana

ETV Bharat / business

నిజామాబాద్​ రైతుకు రూ.29 కోట్ల లాటరీ - 4 మిలియన్ డాలర్లు

తెలంగాణ రైతు... విలాస్ రిక్కాల దుబాయ్​ రాఫిల్​ లాటరీలో 4 మిలియన్​ డాలర్లు గెలుచుకున్నాడు. భార్య నుంచి రూ.20 వేలు అప్పుతీసుకుని మరీ లాటరీ టిక్కెట్టు కొన్న అతనికి అదృష్టం కలిసొచ్చి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.

భార్య అప్పు ఇచ్చింది- రైతుకు లాటరీ కలిసొచ్చింది!

By

Published : Aug 4, 2019, 1:30 PM IST

Updated : Aug 4, 2019, 6:42 PM IST

దుబాయ్​లో ఉద్యోగం దొరకక నిరాశతో స్వదేశానికి తిరిగొచ్చిన ఓ భారతీయ రైతుకు బంపర్​ లాటరీ తగిలింది. దుబాయ్ రాఫిల్​ లాటరీలో 4 మిలియన్ డాలర్లకు పైగా గెలుచుకుని, రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతుడయ్యాడు. భార్య నుంచి అప్పు తీసుకుని మరీ లాటరీ టికెట్టు కొని తిరుగలోని జాక్​పాట్​ కొట్టాడు.

ప్రస్తుతం హైదరాబాద్​లో ఉంటున్న విలాస్ రిక్కాల బిగ్​ టికెట్ రాఫిల్​లో 4.8 మిలియన్​ డాలర్లు (సుమారు 28 కోట్లు 42 లక్షలు) గెలుచుకున్నట్లు గల్ఫ్​ న్యూస్​ తెలిపింది. ఈ విషయం ఆయనకు శనివారమే తెలిసింది.

ఉద్యోగ ప్రయత్నాలు విఫలం

తెలంగాణ నిజామాబాద్​ జిల్లా జర్కాన్​పల్లి గ్రామానికి చెందిన విలాస్ రిక్కాల, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. భార్యాభర్తలు ఇద్దరూ వ్యవసాయ పనులు చేస్తుంటారు. వీరి వార్షిక ఆదాయం సుమారు రూ.3 లక్షలు. ఈ ఆదాయం చాలక ఆయన దుబాయ్​లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేశాడు. కొన్నాళ్లు డ్రైవర్​గానూ పనిచేశాడు.

కలిసొచ్చిన అదృష్టం

విలాస్ ఉద్యోగ ప్రయత్నాలు కూడా విఫలం కావడం వల్ల... 45 రోజుల క్రితం భారత్​కు తిరిగి వచ్చేశాడు. భార్య పద్మ నుంచి రూ.20 వేలు అప్పుతీసుకుని, దుబాయ్​లో ఉన్న స్నేహితుడు రవికి ఇచ్చాడు. అతను విలాస్ పేరుమీద మూడు లాటరీ టికెట్లు తీసుకున్నాడు. అదృష్టం కలిసొచ్చి విలాస్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు. దీనికంతటికీ భార్య పద్మే కారణమని మురిసిపోతున్నాడు విలాస్.

ఇదీ చూడండి: గూగుల్​ ఉండగా 'ఫోన్'​ పోయిందని దిగులేల?

Last Updated : Aug 4, 2019, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details