తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా కాలంలో.. మన విమానాశ్రయాలే భేష్‌! - Indian Airports rankings

కొవిడ్​ విజృంభణ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటించిన విమానాశ్రయాల్లో భారత ఎయిర్​పోర్ట్స్​కు చోటు దక్కింది. తొలి పదిస్థానాల్లో మన దేశం నుంచే రెండు ఎంపికయ్యాయి. అంతర్జాతీయ అంచనాల సంస్థ సేఫ్​ ట్రావెల్ బారోమీటర్​ ఈ వివరాలను విడుదల చేసింది.

Indian Airports emerges as worlds safest Airport amid Corona pandemic
కరోనా కాలంలో.. మన విమానాశ్రయాలే భేష్‌!

By

Published : Oct 22, 2020, 2:04 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన విమానాశ్రయాల జాబితాలో మన దేశం నుంచి రెండింటికి స్థానం దక్కింది. దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐఏ), కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాలు.. ప్రపంచ వ్యాప్తంగా తొలి పది స్థానాల్లో చోటు సాధించాయి. కొవిడ్​కు సంబంధించిన ఆరోగ్య, భద్రతా ప్రమాణాల అమలులో ఈ విమానాశ్రయాలు అత్యుత్తమమని అంతర్జాతీయ అంచనాల సంస్థ 'సేఫ్‌ ట్రావెల్‌ బారోమీటర్‌' కితాబిచ్చింది.

మదింపు చేస్తారిలా..

కొవిడ్‌-19 కాలంలో.. 200 విమానయాన సంస్థల్లో ఆరోగ్య, భద్రతా, క్వారంటైన్‌ తదితర 20 భద్రతా ప్రమాణాల అమలును సేఫ్‌ ట్రావెల్‌ బారోమీటర్‌ మదింపు చేసింది. ఈ మేరకు సంస్థ అంతర్జాతీయ స్థాయి 'సేఫ్‌ ట్రావెల్‌స్కోరు'ను వెల్లడించింది.

ఈ జాబితాలో సింగపూర్‌లోని చాంగీ విమానాశ్రయం 4.7 స్కోరు సాధించి తొలి స్థానంలో ఉంది. ఈ విభాగంలో రెండో స్థానంలో ఉన్న ఇందిరా గాంధీ విమానాశ్రయానికి 4.6 లభించినట్టు దిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ ప్రకటించింది. ఇక బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం ఏడో స్థానంలో ఉంది.

ఆ ఆరింట్లో రెండు భారత్​వే..

4.6 స్కోరును సాధించిన జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ విమానాశ్రయం, చైనాకు చెందిన చెంగ్డూ షువాంగ్లియు అంతర్జాతీయ విమానాశ్రయాలు కూడా సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. తర్వాతి స్థానాల్లో అబుదాబి, దుబాయ్, కెంపెగౌడ, హాంకాంగ్‌, బీజింగ్‌ క్యాపిటల్‌, హీత్రూ(లండన్‌) అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నట్టు సంస్థ తెలిపింది. తొలి పది స్థానాల్లో ఆరు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలోనే ఉండగా.. అందులో భారత్​కు చెందినవే రెండు ఉండటం విశేషం.

ఇదీ చదవండి:వరదలతో పాడైన వాహనాలకు బీమా వర్తిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details