రానున్న రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోని మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తుందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. పౌరుల తలసరి ఆదాయమూ రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో జరిగిన ఆన్‌లైన్ ముఖాముఖిలో ఆయన మాట్లాడారు. దేశంలో దాదాపు 50శాతానికి పైగా మధ్యతరగతి కుటుంబాలేనని.. ఏటా వీరి ఆదాయం మూడు నుంచి నాలుగు శాతం పెరుగుతుందని అంబానీ అంచనా వేశారు.
"రానున్న రెండు దశాబ్దాల్లో ప్రపంచంలోనే మూడు అతిపెద్ద ఆర్థికవ్యవస్థల్లో భారత్ నిలుస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నాను. యువకులు నడిపించే డిజిటల్ సొసైటీగా భారత్ మారబోతుంది. తలసరి ఆదాయం 1800-2000 డాలర్ల నుంచి 5వేల డాలర్లకు పెరుగుతుంది. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర కంపెనీలు, వ్యాపారవేత్తలు భారత ఆర్థికవ్యవస్థలో భాగస్వామ్యమై.. రానున్న దశాబ్దాల్లో జరిగే సామాజిక మార్పులో పాలుపంచుకోవడం సువర్ణావకాశం."