తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వచ్ఛమైన ఇంధన సరఫరా దేశంగా భారత్​!

అత్యంత స్వచ్ఛమైన పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే దేశంగా భారత్​ అవరతరించనుంది. అనతి కాలంలో ఈ ఘనత సాధించిన దేశంగా కీర్తి గడించనుంది. తక్కువ కాలుష్యాన్ని నమోదు చేసే ఇంధనాన్ని ఏప్రిల్​ 1 నుంచి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నాయి చమురు సంస్థలు.

By

Published : Feb 19, 2020, 4:39 PM IST

Updated : Mar 1, 2020, 8:41 PM IST

BIZ-PETROL-SUPPLY
పెట్రోల్

ప్రపంచంలో అత్యంత స్వచ్ఛమైన 'యూరో-6' ప్రమాణాలతో కూడిన పెట్రోల్​, డీజిల్​ను ఏప్రిల్​ 1 నుంచి సరఫరా చేయనుంది భారత్​. యూరో-4 ఉద్గార గ్రేడ్​ నుంచి యూరో-6కు భారత్​ రూపాంతరం చెందనుంది. మూడేళ్లలో ఈ ఘనత సాధించిన తొలి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్​ నిలువనుంది.

ప్రపంచంలో ఇంధన ఉద్గార స్థాయిలను యూరోలతో కొలుస్తారు. దేశంలో మాత్రం భారత్​ స్టేజ్​(బీఎస్​)గా పిలుస్తాం. ప్రస్తుతం దేశంలో బీఎస్​-4(యూరో-4) స్థాయి ఇంధనాలు సరఫరా అవుతున్నాయి. త్వరలోనే కాలుష్యం తక్కువగా వెలువరించే బీఎస్​-6 స్థాయి పెట్రోల్, డీజిల్​ను అన్ని చమురు సంస్థలు సరఫరా చేయనున్నాయి.

"దేశంలోని అన్ని రిఫైనరీ సంస్థలు చాలా తక్కువ సల్ఫర్​ను విడుదల చేసే బీఎస్​-6 పెట్రోల్, డీజిల్​ను ఉత్పత్తి చేయటం 2019 చివర్లోనే ప్రారంభించాయి. దేశంలో స్వచ్ఛమైన పెట్రోల్​ను సరఫరా అందుబాటులోకి రానుంది. ఇప్పటికే గిడ్డంగులకు కొత్త ఇంధనాన్ని పంపించాం. ఏప్రిల్​ 1 నుంచి అన్ని బంకుల్లో స్వచ్ఛమైన పెట్రోల్​, డీజిల్​ లభిస్తాయి."

- సంజీవ్ సింగ్​, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్​ ఛైర్మన్​

భారత్​ 2010లో బీఎస్​-3 ప్రమాణాలు ఉన్న ఇంధనాన్ని ఉత్పత్తి చేసింది. ఇందులో 350 పీపీఎం సల్ఫర్​ సమ్మేళనం ఉంటుంది. అక్కడ నుంచి 50 పీపీఎం సల్ఫర్​ వెలువడే బీఎస్​-4కు మారటానికి ఏడేళ్లు పట్టింది. 10 పీపీఎం సల్ఫర్​ను వెలువరించే బీఎస్​-6 ఇంధనాన్ని సరఫరా చేసేందుకు మూడేళ్లు మాత్రమే పట్టడం విశేషం. సీఎన్​జీ తరహాలో అతి తక్కువ కాలుష్యాన్ని వెలువరిస్తుంది ఈ రకమైన ఇంధనం.

1990 నుంచి ఇంధన స్వచ్ఛతలో మార్పులు తీసుకొస్తుంది భారత్​.

బీఎస్​-6 ప్రమాణాలతో కూడిన ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు చమురు సంస్థలు సుమారు రూ.35 వేల కోట్లు ఖర్చు చేశాయి. ఇప్పటికే దిల్లీ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఎస్​-6 ఇంధనాన్ని సరఫరా చేస్తున్నాయి చమురు సంస్థలు.

Last Updated : Mar 1, 2020, 8:41 PM IST

ABOUT THE AUTHOR

...view details