అమెరికా, జపాన్ లాంటి ఇతర దేశాలతో పాటు భారత్‌లో కూడా చమురు ధరలను (Oil Price News) తగ్గించే దిశగా కేంద్రం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. అత్యవసర నిల్వల నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి (Crude Oil News). సుమారు 38 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్... తూర్పు, పశ్చిమ తీరాల్లోని మూడు ప్రదేశాల్లో నిల్వ చేస్తుంది. అయితే ఇప్పుడు వాటి నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును విడుదల చేయనుంది.
Crude Oil News: చమురు ధరలు తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం! - crude oil release
భారత్ అత్యవసర నిల్వల నుంచి సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఇలా చేయడం వల్ల ఇంధన ధరలు తగ్గుతాయని పేర్కొన్నాయి(Crude Oil News).
7 నుంచి 10 రోజుల వ్యవధిలో దాదాపు 5 మిలియన్ బ్యారెళ్లను విడుదల చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. దీనిని మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (ఎంఆర్‌పీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) విక్రయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంస్థలకు ఇప్పటికే అత్యవసర నిల్వల నుంచి పైప్‌లైన్ అనుసంధానం చేసి ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే రానున్నట్లు స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరింత ముడి చమురును విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ వివాదానికి త్వరలోనే చెక్!