దేశంలో వచ్చే అయిదేళ్లలో వంద కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. మరో అయిదు కోట్ల టెలివిజన్ సెట్లు, లాప్‌టాప్‌ల చొప్పున తయారు చేయాలని కూడా నిర్ణయించినట్లు సీఐఐ సదస్సులో వెల్లడించారు.
దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు చేర్చాలని భావిస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ప్రపంచ మార్కెట్‌లో లాప్‌టాప్, ట్యాబ్లెట్ తయారీలో ప్రస్తుతం భారత్‌కు ఉన్న ఒక శాతం వాటా 26శాతానికి పెరగనుందని అన్నారు. దీని ద్వారా 5లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.