రాబోయే ఆరు నెలల్లో లిథియమ్ అయాన్ బ్యాటరీలను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయగలగే స్థాయికి భారత్ చేరుకుంటుందని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. నిర్ణీత సమయంలోగా.. విద్యుత్ వాహన(ఈవీ) తయారీ రంగంలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు. అమెజాన్ స్మభవ్ సదస్సులో ఆయన వర్చువల్గా పాల్గొన్నారు.
"విద్యుత్ వాహన తయారీ వైపు భారత్ అడుగులు వేస్తోంది. అతిత్వరలోనే.. విద్యుత్ వాహన తయారీ రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది. భారత్లో ఎన్నో ప్రసిద్ధ బ్రాండ్ కంపెనీలు వీటిని తయారు చేయనున్నాయి. హరిత ఇంధనాన్ని ఉత్పత్తి చేయటంలో భారత్కు అద్వితీయమైన సామర్థ్యాలు ఉన్నాయి. ఆరు నెలల్లో లిథియం అయాన్ బ్యాటరీలను 100 శాతం తయారు చేసే స్థాయికి ఎదుగుతుందని నేను విశ్వసిస్తున్నాను."
-నితిన్ గడ్కరీ, కేంద్ర రవాణా శాఖ మంత్రి