రాబోయే మూడు రోజుల్లో చైనా నుంచి 220 టన్నుల అత్యవసర ఔషధ సరకులను విమానంలో తరలిస్తామని విమానయాన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. చైనా, ఇండియా ఎయిరోబ్రిడ్జ్ నుంచి ఈ నెలలో ఎయిర్ ఇండియా 300 టన్నుల ఔషధ కార్గోను తరలించిందని ఆయన వెల్లడించారు.
'రాబోయే మూడు రోజుల్లో ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, బ్లూడార్ట్ కలిసి 220 టన్నుల అత్యవసర ఔషధ సరకులను తరలించాలన్నది ప్రణాళిక.'
- హర్దీప్‌సింగ్ పూరి ట్వీట్.