దేశ సంస్కృతి, జానపద కథల ప్రేరణతో కొత్త గేమ్స్ రూపొందించి డిజిటల్ గేమింగ్ రంగానికి నాయకత్వం వహించే స్థానానికి దేశం ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో బొమ్మల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన చర్చా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని పెంచేందుకు బొమ్మలు ఒక అద్భుతమైన మాధ్యమమని వ్యాఖ్యానించారు. ఈ రంగంలో నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయాలని స్టార్టప్ కంపెనీలు, యువతను కోరారు.
'గేమింగ్ రంగానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలి' - gaming sector news
డిజిటల్ గేమింగ్ రంగానికి నాయకత్వం వహించే స్థాయికి భారత్ ఎదగాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని పెంచేందుకు బొమ్మలు ఒక అద్భుతమైన మాధ్యమమని అన్నారు. ఈ రంగంలో నూతన ఆవిష్కరణలపై దృష్టిసారించి ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయాలని స్టార్టప్ కంపెనీలు, యువతను కోరారు.
'గేమింగ్ రంగానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలి'
దేశ నాగరికత, విశిష్టతను చాటిచెప్పే మార్గాలను చూడాలన్నారు మోదీ. శక్తిమంతమైన బొమ్మల తయారీ రంగం..ఆత్మనిర్భర్ భారత్ కలలను సాకారం చేసేందుకు దోహదం చేస్తుందని ట్వీట్ చేశారు. దీనిపై విద్యాసంస్థలు కూడా హాకథాన్‌లు నిర్వహించ గలవన్న ప్రధాని.. పర్యావరణహిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారించాలన్నారు. పిల్లల్లో నైపుణ్యాభివృద్ధికి ఈ పరిశ్రమ దోహదం చేస్తుందన్నారు. ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ నినాదంలో భాగంగా ఈ పరిశ్రమను ప్రోత్సహించడమే లక్ష్యమని పేర్కొన్నారు.