తెలంగాణ

telangana

ETV Bharat / business

'అంత స్పీడ్​తో వెళ్తేనే మోదీ కల సాకారం' - దేశ జీడీపీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కల... 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్​ను నిలపడం. మరి దీన్ని సాధించాలంటే ఐదేళ్లపాటు ఏటా 9 శాతం చొప్పున వృద్ధి సాధించాల్సి ఉంటుందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ 'ఈవై' లెక్కగట్టింది. మొత్తం పెట్టుబడి రేటునూ దేశ జీడీపీలో 38 శాతానికి పెంచాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.

'అంత స్పీడ్​తో వెళ్తేనే మోదీ కల సాకారం'

By

Published : Aug 4, 2019, 5:08 PM IST

Updated : Aug 4, 2019, 9:39 PM IST

ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారత్​ ఐదేళ్లపాటు ప్రతి సంవత్సరం 9 శాతం చొప్పున వృద్ధి చెందాల్సి ఉంటుందని లెక్కగట్టింది ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ 'ఈవై'. మొత్తం పెట్టుబడి రేటును దేశ జీడీపీలో 38 శాతానికి పెంచాల్సి ఉంటుందని ఎకానమీ వాచ్​ పేరిట రూపొందించిన నివేదికలో వివరించింది. అప్పుడే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కల నెరవేరుతుందని అభిప్రాయపడింది.

2020 మార్చి 31తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి నమోదవుతుందని అనుకుంటే... భారత్​ 3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఈవై తన తాజా ఎడిషన్​లో పేర్కొంది. గతేడాది భారత్​ 2.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఉంది.

9 శాతం చొప్పున వృద్ధి సాధిస్తే..

ఐదేళ్ల పాటు ఏటా 9 శాతం చొప్పున్న వృద్ధి చెందితే.... భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2021 ఆర్థిక సంవత్సరంలో 3.3 ట్రిలియన్, 2022లో 3.6 ట్రిలియన్​, 2023లో 4.1 ట్రిలియన్​, 2024లో 4.5 ట్రిలియన్​, 2025 ఆర్థిక సంవత్సరంలో 5 ట్రిలియన్​ డాలర్లుకు చేరుకుంటుందని ఈవై అంచనా వేసింది.

"ద్రవ్యోల్బణం 4 శాతంగా ఉంటుందని అనుకుంటే... 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడానికి 9 శాతానికి దగ్గరగా ఉన్న నిజమైన వృద్ధి రేటు అవసరం. ఇది నామమాత్రపు వృద్ధిరేటు 13 శాతాన్ని సూచిస్తుంది."
-ఈవై 'ఎకానమీ వాచ్​' నివేదిక

పెట్టుబడులు ఇలా...

2021 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధి సాధించాలంటే... పెట్టుబడి రేటు జీడీపీలో 38 శాతానికి దగ్గరగా పెంచాల్సి ఉంటుందని అంచనా వేసింది ఈవే.
2019 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి రేటు 31.3గా ఉంది.

ఇదీ చూడండి: విమాన ఛార్జీలు తగ్గించిన ఎయిర్ ​ఇండియా

Last Updated : Aug 4, 2019, 9:39 PM IST

ABOUT THE AUTHOR

...view details