భారత దేశం.. పన్ను 'ఉగ్రవాదం' నుంచి పన్ను 'పారదర్శకత' వైపు అడుగులు వేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. వివాదాల పరిష్కరణ వ్యవస్థను ప్రభుత్వం మెరుగుపరచడమే ఇందుకు కారణమన్నారు. ఒడిశా కటక్‌లో నిర్మించిన ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ భవనం ప్రారంభోత్సవంలో ఆన్లైన్ ద్వారా పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
పన్ను చెల్లింపుదారులు.. రీఫండ్ కోసం ఇకపై ఏళ్ల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేదని ప్రధాని స్పష్టం చేశారు. అదే సమయంలో పన్ను చెల్లింపుదారులను అధికారులు అసౌకర్యానికి గురిచేయకూడదన్నారు. పన్ను చెల్లింపుదారుల హక్కులు, బాధ్యతలను గుర్తించే దేశాల్లో భారత్ ఒకటని పేర్కొన్నారు.